బాద్‌షా..కు..అరుదైన గౌరవం

బాలీవుడ్ లో ఆయనో సూపర్ స్టార్. ఎవ్వరి ప్రోత్సాహం, తోడ్పాటు లేకుండానే తన స్వంత టాలెంట్ తో అగ్ర హీరోగా చెలామణి అవుతూ వచ్చారు. ఆయన మేనరిజం, కేరక్టర్ వెరీ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లి పోవడం షారుఖ్ ఖాన్ కు ఇష్టం. ఒక్కసారి స్టార్ డమ్ వచ్చే సరికల్లా కొందరు మారి పోతారు. తామేదో గొప్పవారమన్న ఫీలింగ్స్ ప్రదర్శిస్తారు. కానీ ఈ బాద్‌షా మాత్రం ఇవేవీ పట్టించు కోడు. ఇండియాలో గొప్ప నటుల్లో తమిళనాడుకు చెందిన తలైవా ఉరఫ్ రజనీకాంత్, బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరులు వీటికి దూరంగా ఉంటారు.

ఆపదలో ఉన్నవారిని ఆదు కోవడం ఈ సూపర్ స్టార్ కు ఇష్టం. ఈ అద్భుతమైన హీరో సినిమాలోనే కాదు నిజ జీవితం లోను రియల్ నటుడు. ఎందుకంటే ఎలాంటి భేషజాలు లేని యాక్టర్. ఈ హీరోకు ఇండియాలోనే కాదు లోకమంతటా లెక్క లేనంత మంది అభిమానులు ఉన్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. కింగ్‌ఖాన్‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై ఆయన పేరును ప్రదర్శించారు. ఆ దేశంలో మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటున్నారు. అక్కడ బాడ్ షా సినిమాలంటే పడిచస్తారు.

ఇక కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారూఖ్‌ ఖాన్ హ్యాపీ బ‌ర్త్‌డే అనే సందేశం బుర్జ్ ఖ‌లీఫాపై ప్రత్యక్షం కాగానే ఆయన అభిమానులు ఆనందంతో పులకరించి పోయారు. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖ‌లీఫాపై ఓ యాక్టర్ పేరు ప్రద‌ర్శించ‌డం ఇదే మొదటి సారి. ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌ 54వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ బాడ్ షా మరిన్ని పుట్టిన రోజులు జరుపు కోవాలి. ఇలాగే సినిమాలతో అలరించాలని కోరుకుందాం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!