మరాఠాలో కొత్త ట్విస్ట్..సేనకు ఎన్సీపీ మద్దతు

మహారాష్ట్రలో రాజకీయాలు మారుతున్నాయి. తాజా ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. బీజేపీ, శివ సేన పార్టీలు కలిసి పోటీ చేయగా..మరో వైపు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. ఈ నాలుగు పార్టీలకు అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపింది. అమిత్ షా రంగం లోకి దిగినా ఫలితం లేక పోయింది. సీఎం కుర్చీ విషయంలో శివ సేన, బీజేపీ పార్టీలు పట్టు వీడడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తాము అధికారాన్ని వదులు కోమని అంటూ అమిత్ షా, ఫడ్నవిస్ లు స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్ చేశారు. 

శివ సేన తో సంబంధం లేకుండానే పవర్ లోకి రావాలని లోపాయికారిగా బీజేపీ నేతలు ట్రై చేస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్నారు శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే. ఎలాగైనా సరే అధికారాన్ని చేజిక్కించు కోవాలని, ఇందు కోసం విపక్షాలతో కలిసేందుకు సిగ్నల్స్ ఇచ్చారు. దీనిని నిజం చేస్తూ ఎన్సీపీ మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయినా సీఎం పీటముడి మాత్రం వీడడం లేదు. ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. ఎన్సీపీ కూడా కీలక సంకేతాలు పంపింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతిస్తామని  సూచన ప్రాయంగా వెల్లడించింది. బీజేపీ తోడ్పాటు లేకుండా ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ముందుకు వస్తే తాము సానుకూలంగా స్పందిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ స్పష్టం చేశారు.

మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ అడుగులు వేస్తే ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కాగా ప్రజలు తమకు విపక్ష స్ధానాన్ని కట్ట బెట్టినందున, ఎన్సీపీ ప్రతిపక్షంలో కూర్చుంటుందని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ప్రకటించిన సమయంలో నవాబ్‌ మాలిక్‌ ప్రకటన అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. నూతన ప్రభుత్వం ఏర్పాటు కాని పక్షంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ నేత సుధీర్‌ ముంగతివర్‌ ప్రకటన పట్ల మాలిక్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని తాము అనుమతించ బోమని, రాష్ట్రానికి ప్రజాస్వామ్య ప్రక్రియలో నూతన దిశను అందిస్తామని స్పష్టం చేశారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!