పతనం అంచున ప్రభుత్వ బ్యాంకులు

ఏ ముహూర్తాన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిందో ఆ రోజు నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్ల సేవలకు మంగళం పాడాయి. ఇప్పటికే వీటిని నిర్వీర్యం చేసే పనిలో పాడింది సర్కార్. తాజాగా టెలికం కంపెనీలకు పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. ఇటీవల సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఒకవేళ ఆయా కంపెనీలకు నష్టాలు వాటిల్లితే ఇక రుణాలు అందజేసిన బ్యాంకులకు వసూలు చేసు కోవడం మరింత కష్టమవుతుంది. చాలా తెలివిగా ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులకే కన్నం వేశాయి ఈ బడా కంపెనీలు. ఒకటా రెండా వందలు కాదు వేల కోట్లను రుణంగా పొందాయి. మొత్తం దేశీయంగా ఇప్పటి దాకా ఆయా టెలికాం కంపెనీలకు లక్షా 15 వేల కోట్ల రూపాయలు బ్యాంకులు ఇచ్చాయి. ఇది వరకే అప్పుల కుప్పగా మారిన టెలికాం సెక్టార్ కు ధర్మాసనం ఇచ్చిన తీర్పు అశనిపాతం లాగా మారింది. ఏజీఆర్ ప్రకారం ప్రభుత్వానికి 93 వేల కోట్లు చెల్లించాలని, ఈ మొత్తం డబ్బులను మూడు నెలల్లో తీర్చాలని ఆదేశించింది. దీంతో ఆయా కంపెనీలకు మరిన్ని నష్టాలు వచ్చాయి. టెలికం కంపెనీలకు సంబంధించి రుణాల లెక్కలు చూస్తే దిమ్మ తిరిగి పోవడం ఖాయం. ఇవ్వన్నీ ప్రజలు బ్యాంకులలో దాచుకున్న డబ్బులు. ఇండియాలో అతిపెద్ద బ్యాంకు...