ఆన్‌‌లైన్‌‌లో మోసాలు..పెరుగుతున్న బాధితులు

 
ఇంటర్నెట్ మాధ్యమం పెరగడం, డేటా కనెక్టివిటీ అద్నుబాటులోకి రావడం, అపరిమితమైన నెట్ వర్క్ వర్కవుట్ అవడంతో కోట్లాది మంది తమ రోజూవారీ లావాదేవీలను ఆన్‌‌లైన్‌‌లోనే నిర్వహిస్తున్నారు. నెట్ వర్క్ విషయంలో ఆయా కంపెనీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోటా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కామర్స్ బిజినెస్ ప్రస్తుతం ట్రిలియన్ డాలర్లను దాటేసింది. ఇదే సెక్టార్ లో వరల్డ్ వైడ్ గా టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాయి చైనాకు చెందిన అలీబాబా, అమెరికాకు చెందిన అమెజాన్, వాల్ మార్ట్ కంపెనీలు. ఇక ఇండియా ఈ కామర్స్ విషయానికి వస్తే ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, ఈ బే కంపెనీలు ఉండగా అమెజాన్, అలీబాబా కూడా కోట్లల్లో లావాదేవీలు జరుపుతున్నాయి. ఆఫర్లు, గిఫ్టుల పేరుతో పండుగలు, ఇతర అకేషన్స్ పేరుతో భారీగా సేల్స్ చేపడుతున్నాయి.
 
ఇదే సమయంలో జనం ఆన్ లైన్ లోనే ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో 80 శాతానికి ఒకే అయినా మిగతా 20 శాతం మాత్రం కోలుకోలేని మోసాలకు లోనవుతున్నారు. కస్టమర్స్ నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆన్‌‌లైన్‌‌లో ఏదో వస్తువు ఆర్డర్ చేస్తే, దానికి బదులు మరొకటి డెలివరీ కావడమో, లేదా డెలివరీ చేస్తామన్న సమయానికి అంది వ్వకుండా నాన్చడమో, డ్యామేజ్‌‌ వస్తువును అందివ్వడమో, ఇలా ఎన్నో సంఘటనలు తరుచు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వీటితోవిసిగి పోయిన కస్టమర్లు ప్రభుత్వ నేషనల్ హెల్ప్‌‌ లైన్‌‌కు కాల్‌‌ చేసి, ఆన్‌‌లైన్ కంపెనీలపై ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారు. ఇలా కంప్లయింట్స్ ఎక్కువగా వస్తున్న కంపెనీల్లో ఫ్లిప్‌‌కార్ట్‌‌ ముందంజలో ఉంది.
 
వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నేషనల్ హెల్ప్‌‌లైన్‌‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.హెల్ప్‌‌లైన్‌‌పై దాఖలవుతున్న ప్రతి ఐదు ఫిర్యాదుల్లో ఒకటి ఆన్‌‌లైన్ కంపెనీకి వ్యతిరేకంగా వస్తున్నట్టు, వాటిలో ఫ్లిప్‌‌కార్ట్‌‌కు వ్యతిరేకంగా ఎక్కువ కంప్లయింట్స్ వస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటాలో వెల్లడైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 5 లక్షల కంప్లయింట్స్‌‌ దాఖలయ్యాయి. వాటిలో లక్షకు పైగా కంప్లయింట్స్ ఆన్‌‌లైన్ కంపెనీలకు వ్యతిరేకంగానే వచ్చినట్టు సమాచారం. 41,600 కంప్లయింట్స్ బ్యాంక్‌‌లకు వ్యతిరేకంగా, 29,400 కంప్లయింట్స్ టెలికాం కంపెనీలకు వ్యతిరేకంగా వచ్చాయి.
 
ఆన్‌‌లైన్‌‌ కంపెనీల కన్జూమర్ బేస్ పెరుగుతున్న కొద్దీ, కంప్లయింట్స్ కూడా పెరుగుతున్నాయి. ఆన్‌‌లైన్ కంపెనీలకు వ్యతిరేకంగా వస్తోన్న కంప్లయింట్స్‌‌లో డెలివరీ జాప్యం, ఎక్స్చేంజ్‌‌లో సమస్యలు, నకిలీ ప్రొడక్ట్‌‌లు డెలివరీ కావడం వంటివి ఎక్కువగా ఉన్నాయి. టెలికాం కంపెనీలకు వ్యతిరేకంగా దాఖలవుతున్న ఫిర్యాదుల్లో ఓవర్‌‌‌‌బిల్లింగ్, కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫిర్యాదులు రిసీవ్ చేసుకున్న అనంతరం కన్జూమర్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆ ఫిర్యాదులను కంపెనీకి పంపించి, ఒక నిర్దేశిత సమయం లోపల పరిష్కరించమని ఆదేశిస్తోంది. 

కామెంట్‌లు