అన్నింటికీ ఆధారమే..లేకుంటే దుర్భరమే

ఇండియాలో బతకాలన్నా లేదా చని పోవాలన్నా అన్నింటికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. ప్రతి ఒక్కరికీ దీనిని తప్పనిసరి చేస్తూ కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా వివిధ భూములు, ఇల్లు, ఇతర ఆస్తులు కొనుగోలుకు సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరి చేయలేదు. దీంతో అవినీతి, అక్రమాలు చెప్పుకోలేని రీతిలో పెరిగాయని కేంద్ర ఆదాయ, పన్నుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మోదీ అధికారంలోకి రాక ముందు నుంచి కూడా బ్లాక్ మనీని వెలుగులోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ఆ దిశగా నోట్లను రద్దు చేశారు. అంతే కాకుండా నగదు లావాదేవీలను పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుతం దివాళా అంచున నిలబడ్డాయి.

ప్రస్తుతం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతోంది కమల సర్కార్. ఇక స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాల్లో అక్రమాలను, అవినీతిని అరి కట్టడానికి ఆధార్‌‌తో లింక్‌‌ చేసే విధానాన్ని తీసుకు రావాలని యోచిస్తోంది. ఈ విషయంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనేది తాజా సమాచారం. దీనిని అమలు చేస్తే నల్లధనం, మనీ లాండరింగ్‌‌పై ప్రభుత్వం సర్జికల్‌‌ స్ట్రైక్‌‌ చేసినట్టేనని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్లాక్‌‌ మనీని వెలికి తీయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రియల్‌‌ ఎస్టేట్‌‌ రంగంలో బినామీ లావాదేవీలను అడ్డుకునేందుకు చట్టం తెస్తుందని అధికార వర్గాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి.

బ్లాక్‌‌ మనీ రియల్‌‌ ఎస్టేట్‌‌ రంగంలోకి రావడం, తగ్గడం వల్ల ఆస్తుల ధరలు తగ్గాయి కానీ ప్రభుత్వ ఆదాయం  మాత్రం గణనీయంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. ఆస్తుల ధరలు తగ్గడం వల్ల బ్లాక్‌‌మనీ పోగవడమూ తగ్గింది. సామాన్యులూ స్థిరాస్తులను కొనగలుగుతున్నారు. 2022 నాటికి అందరికీ గృహవ సతిని అందు బాటు లోకి తేవాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రియల్‌‌ ఎస్టేట్‌‌ రంగంలో బినామీ లావాదేవీలను, బ్లాక్‌‌ మనీ చెలామణిని అడ్డు కోవడానికి ఆస్తులను ఆధార్‌‌ సంఖ్యకు లింక్‌‌ చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక బిల్లు డ్రాఫ్ట్‌‌ తయారీ ముగింపు దశకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

ఈ చట్టం అమల్లోకి వస్తే రియల్‌‌ ఎస్టేట్‌‌ లావాదేవీల్లో అవినీతి తగ్గుతుంది. పారదర్శకత పెరుగుతుంది. ఆస్తుల కొనుగోలుకు వైట్‌‌ మనీయే కావాల్సినందున వాటి ధరలు సహజంగానే తగ్గుతాయి. ఎక్కువ ఆస్తులు ఉన్న వారిపై ఐటీ అధికారులు కన్నేస్తారు కాబట్టి మొదట్లో ఆస్తుల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ఆధార్‌‌ లింకింగ్‌‌ చట్టం వస్తే ఇళ్ల ధరలు సామాన్యుడికి కూడా అందుబాటులో కి వస్తాయి. మొత్తం మీద ఆధార్ అనుసంధానం చేస్తే గనుక అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!