మహర్షి అరుదైన రికార్డ్
ప్రిన్స్ మహేష్ బాబు సినీ కెరీర్లో అత్యంత జనాదరణ పొందిన సినిమాగా మహర్షి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం చేపట్టారు. ఇందులో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నటించారు మహేష్ బాబు. నటనతో ఆకట్టు కోవడమే కాదు భారీ వసూళ్లు రాబట్టేలా అద్భుతంగా మెప్పించారు ఈ ప్రిన్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా ‘మహర్షి’ సినిమా రూపొందింది. ఈ మూవీకి దిల్ రాజు, అశ్వనిదత్, ప్రసాద్ పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. గత మే నెలలో మహర్షి సినిమాను విడుదల చేశారు.
మహేష్ సినిమాను వంశీ పైడిపల్లి ఏకంగా 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 170 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మహేష్ బాబుకు సినిమా పరంగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అంతకు ముందు కొరటాల శివ డైరెక్షన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేశారు. ఈ రెండూ భారీ విజయాలను నమోదు చేశాయి. ప్రిన్స్ కు బలాన్ని ఇచ్చాయి. ఇదిలా ఉండగా సంతషం పట్టలేక కొరటాల శివకు భారీ ఖర్చుతో కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. వంశీ మాత్రం మనసు పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ తో మహర్షి మూవీని తీశారు.
తాజాగా ట్విట్టర్ మోస్ట్ ఇన్‌ఫ్లుయన్షల్ మూమెంట్స్ ఆన్ ట్విట్టర్లో చోటు సంపాదించుకున్న ఐదు ప్రోగ్రామ్‌లను ప్రకటించింది. వీటిలో విశ్వాసం మొదటి స్థానంలో ఉండగా, లోకసభ ఎలక్షన్స్ 2019 , సీడబ్ల్యూసీ 19 వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించు కున్నాయి. ఇక మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. తదుపరి ఐదో స్థానంలో హిందువుల పండగ దీపావళి చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గర్వంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర కెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి