దమ్మున్న మగాడు ఉదయ్ శంకర్

వాడు మగాడ్రా బుజ్జి అన్న తెలుగు సినిమా డైలాగ్ కు ఖచ్చితంగా సరి పోతాడు ఉదయ్ శంకర్. ఎవరితను అనుకుంటున్నారా..భారతీయ మీడియాను ఏలుతున్న ఒకే ఒక్క మగాడు..స్టార్ టీవీ సీయివో. ఇప్పుడు ఇతడే మోస్ట్ పాపులర్ హీరో. ఇతడికున్నంత ఫాలోయింగ్ ఇంకెవ్వరికీ లేదంటే నమ్మలేం. స్టార్ గ్రూప్ కు భారతీయతను జోడించి కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. అందరు నడిచిన బాటలో నడిస్తే కిక్ ఏముంటుంది అని ప్రశ్నిస్తాడు అమాయకంగా. ఏకంగా కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన స్టార్ టీవీ సంస్థను ఏకంగా ట్రిలియన్ డాలర్ల రేంజ్ లోకి తీసుకు వెళ్ళాడు. ఎవరికీ అందడు. అతడు అనుకున్నాడంటే ఇక ప్రత్యర్థులు చిత్తై పోవాల్సిందే. అది అతడికున్న టాలెంట్. ఎక్కడ ఎప్పుడు దెబ్బ కొడతాడా తెలియదు. ఆలోచనల్లో లయన్ ను తలపిస్తే ఆచరణలో చిరుతను గుర్తుకు తెస్తారు ఉదయ్ శంకర్. తాజాగా ఇండియాను ప్రభావితం చేసిన వ్యక్తులు 100 మందిని ఎంపిక చేస్తే స్టార్ అధిపతి ఉదయ్ శంకర్ మొదటి ప్లేస్ లో నిలిచాడు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీని దాటేసి చరిత్ర సృష్టించారు. ఆసియా ఖండంలో స్టార్ టీవీ టాప్ రేంజ్ లోకి దూసుకు వెళ్ళింది. ఇండియన్ మీడియా మార్కెట్ ను శాసిస్తున్న స్టార్ ..ప్రపంచ మా...