దమ్మున్న మగాడు ఉదయ్ శంకర్

వాడు మగాడ్రా బుజ్జి అన్న తెలుగు సినిమా డైలాగ్ కు ఖచ్చితంగా సరి పోతాడు ఉదయ్ శంకర్. ఎవరితను అనుకుంటున్నారా..భారతీయ మీడియాను ఏలుతున్న ఒకే ఒక్క మగాడు..స్టార్ టీవీ సీయివో. ఇప్పుడు ఇతడే మోస్ట్ పాపులర్ హీరో. ఇతడికున్నంత ఫాలోయింగ్ ఇంకెవ్వరికీ లేదంటే నమ్మలేం. స్టార్ గ్రూప్ కు భారతీయతను జోడించి కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. అందరు నడిచిన బాటలో నడిస్తే కిక్ ఏముంటుంది అని ప్రశ్నిస్తాడు అమాయకంగా. ఏకంగా కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన స్టార్ టీవీ సంస్థను ఏకంగా ట్రిలియన్ డాలర్ల రేంజ్ లోకి తీసుకు వెళ్ళాడు.

ఎవరికీ అందడు. అతడు అనుకున్నాడంటే ఇక ప్రత్యర్థులు చిత్తై పోవాల్సిందే. అది అతడికున్న టాలెంట్. ఎక్కడ ఎప్పుడు దెబ్బ కొడతాడా తెలియదు. ఆలోచనల్లో లయన్ ను తలపిస్తే ఆచరణలో చిరుతను గుర్తుకు తెస్తారు ఉదయ్ శంకర్. తాజాగా ఇండియాను ప్రభావితం చేసిన వ్యక్తులు 100 మందిని ఎంపిక చేస్తే స్టార్ అధిపతి ఉదయ్ శంకర్ మొదటి ప్లేస్ లో నిలిచాడు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీని దాటేసి చరిత్ర సృష్టించారు.  ఆసియా ఖండంలో స్టార్ టీవీ టాప్ రేంజ్ లోకి దూసుకు వెళ్ళింది. ఇండియన్ మీడియా మార్కెట్ ను శాసిస్తున్న స్టార్ ..ప్రపంచ మార్కెట్ లో నెంబర్ వన్ పొజిషన్ చేజిక్కుంచు కోవాలన్నదే తన ముందున్న టార్గెట్ అంటారు ఉదయ్ శంకర్ .

ఎక్కువగా మాట్లాడటం ఇష్టపడని ఇతడు ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే చాలు ఇక వార్ వన్ సైడ్ కావాల్సిందే. ఇప్పుడు అన్ని రీజనల్ ప్రాంతాల్లోకి స్టార్ ను తీసుకు వెళ్ళాడు. అంతే కాకుండా అక్కడ ప్రజలతో కనెక్ట్ అయ్యేలా ప్రోగ్రామ్స్ వచ్చేలా చేసాడు. మార్కెట్ లో తన పొజిషన్ ను పదిలం చేసుకుంటూనే ప్రత్యర్థి మీడియా సంస్థలు దరిదాపుల్లోకి రాకుండా చేశాడు. ఇప్పుడు నార్త్ లో దుమ్ము రేపుతున్న స్టార్ విభిన్నమైన కార్యక్రమాలతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలను షేక్ చేసేలా చేశాడు. ఒకే ఒక్క ప్రోగ్రాం తో భారతీయ వినోద రంగంలో ఒక్కసారిగా నెంబర్ వన్ పొజిషన్ కు తీసుకు వచ్చాడు ఉదయ్ .

అంతేనా జస్ట్ కిల్క్ చేస్తే చాలు కావాల్సినన్ని వీడియోలు చూసుకునే సదుపాయం కల్పించాడు. ఇప్పుడు యూట్యూబ్ కు ధీటుగా ఎదుగుతోంది. నెట్ ఫ్లిక్స్ కు పోటీగా ఇండియన్ నీటిజన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. అదే హాట్ స్టార్. సినిమాలు, వినోదం, సీరియల్స్ , స్పోర్ట్స్ , ప్రతిదీ అందుబాటులో ఉంచారు. ముకేశ్ అంబానీ, కోహ్లీ , మోడీ , అమిత్ షా ల కంటే ఉదయ్ శంకర్ ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. ఇండియాలో అతడు ఒక్కడే దమ్మున్న మగాడుగా ..సక్సెస్ ఫుల్ పర్సన్ గా నిలిచాడు. హాట్స్ అఫ్ యు..ఉదయ్ శంకర్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!