క్యూ కట్టిన జనం..వికసిస్తున్న కమలం
తెలంగాణాలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు దేశంలో ఒకే పార్టీ, ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేశం అన్న నినాదాన్ని నిజం చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఇప్పటికే తెలంగాణాలో ఉద్యమ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగు లేకుండా పోయింది. గతలోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భంగ పాటు కలిగింది. ముఖ్యమంత్రి స్వంత కూతురు, ఎంపీగా ఉన్న కవితను చిత్తుగా ఓడించారు. దీంతో కమలం తమ పార్టీ పట్ల ప్రజలకు ప్రేమ, అభిమానం ఉందని తేటతెల్లడం కావడంతో బీజీపీ రంగం లోకి దిగింది . చాప కింద నీరులా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విస్తరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.
టీడీపీ, టీఆర్ఎస్ , కాంగ్రెస్, తదితర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , తదితరులు భారీ ఎత్తున జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీకి పూర్వ వైభవం రానుందని సీనియర్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేలాది మంది కార్యకర్తలు కలిగిన తెలుగుదేశం పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారు . దీంతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఈ పార్టీకి చేని నేతలు, కార్యకర్తలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు .దీంతో కొందరు అధికార పార్టీలో చేరితే, చాలా మంది ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూశారు. అన్ని పార్టీలకు రెండో సారి కేంద్రంలో పవర్ లోకి వచ్చిన బీజేపీ నే బెటర్ అంటూ వలస బాట పట్టారు.
ఎంపీ గరికపాటి మోహన్ రావ్, లంకల దీపక్ రెడ్డి, ఈగ మల్లేశం , పాల్వాయి రాజనీకుమారి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ , మువ్వా సత్యనారాయణ, పుల్లారావు యాదవ్ , కోనేరు చిన్ని, సామ రంగా రెడ్డి, అంజయ్య యాదవ్ , సాధినేని శ్రీనివాస రావ్ , బందరు శోభారాణి , అబ్బయ్య, జగనాయక్ , తదితరులు పెద్దఎత్తున చేరారు. ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన సభకు భారీగా హాజరయ్యారు. ఈ దెబ్బతో అధికార పార్టీలో కదలిక మొదలిస్తోన్ది. ఈసారి ఎలాగైనా సరే తెలంగాణాలో పాగా వేయాలని కృషి చేస్తోంది. అన్ని పార్టీలకు చెందిన బలమైన నాయకులను టార్గెట్ చేస్తోంది. ఆ మేరకు పార్టీ ప్లాం వర్కవుట్ అవుతోందని చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లో ఇంకెంత మంది చేరుతారనేది కాలమే సమాధానం చెప్పాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి