ఆలయాలు క్లోజ్..దర్శనాలు బంద్

కరోనా ఎఫెక్ట్ దెబ్బకు అన్ని రంగాలు విలవిలలాడుతుండగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ మూసి వేశారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన తిరుమలలో దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈఓ సింఘాల్ ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డిలతో చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వేలాది మంది ఇప్పటికే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. వీరికి కోలుకోలేని షాక్ ఇచ్చింది టీటీడీ. కరోనా వ్యాధి ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పటికే విద్యా సంస్థలను మూసి వుంచారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. ఎవ్వరూ బయటకు రావద్దని, కనీసం 15 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. దీంతో ప్రధాన ఆలయాలు వేములాడ రాజన్న, యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, భద్రాద్రి రామాలయం, బాసర, ఆలంపూర్, బీచుపల్లి, శ్రీశైలం, తిరుమల తిరుపతి దేవస్థానం, కాణిపాకం, శ్రీశైలం, మహానంది, మంత్రాలయంతో పాటు శ్రీకా...