సామాన్యుడిదే విజయం..కేజ్రీదే రాజ్యం

సమాచార హక్కు చట్టం భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు. దేశ వ్యాప్తంగా తమకంటూ ఎదురే లేకుండా చేసుకుంటూ వస్తున్న మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా చేసిన చరిత్ర ఆమ్ ఆద్మి పార్టీకే దక్కింది. ఎలాంటి వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయకుండా కేవలం అభివృద్ధి మంత్రం మాత్రమే జపిస్తూ వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఊహించని రీతిలో సక్సెస్ సాధించారు. ముచ్చటగా మూడోసారి ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బీజేపీకి చెందిన మంత్రులు, ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షాతో పాటు పలువురు సీనియర్ దిగ్గజాలు సైతం ఢిల్లీలో విస్తృతంగా పర్యటించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేపట్టారు. అయినా వీరి పాచికలు పారలేదు. వ్యూహాలు ఫలించలేదు. ఢిల్లీ ఓటర్లు మాత్రం మాయ మాటలు, హామీలను నమ్మలేదు. బీజేపీ మాత్రం ఎలాగైనా సరే ఈసారి కేజ్రీవాల్ ను గద్దె దించాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీలు సై...