కర్నాటక స్పీకర్ సంచలన నిర్ణయం .. 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై వేటు

కన్నడ నాట పవర్ పాలిటిక్స్ కంటిన్యూ అవుతూనే వున్నాయి. నిన్నటి దాకా 15 రోజుల పాటు ఉత్కంఠ కొనసాగింది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కూలి పోవడం, బీజేపీ సర్కార్ కొలువు తీరడం, ఆ పార్టీ తరపున యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా హుటా హుటిన ప్రమాణ స్వీకారం చేయడం జరిగి పోయింది. ప్రభుత్వానికి కావాల్సిన బలాన్ని తిరిగి నిరూపించు కోవాల్సిన పరిస్థితి బీజేపీపై ఉంది. ఇందు కోసం ఇప్పటికే ముగ్గురు రెబల్ ఎమ్మ్యేల్యపై అనర్హత వేటు వేశారు స్పీకర్ రమేష్ కుమార్. దీంతో కేంద్రంలోని కమల సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఎలాగైనా సరే కర్నాటకలో ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపించాలనే కృత నిశ్చయంతో ఉంది. దీంతో రాజ్యాంగబద్దంగా ఎన్నికైన స్పీకర్ ఇపుడు కీలకంగా మారడంతో వ్యూహాలకు పదును పెడుతోంది. స్పీకర్‌గా ఎన్నికైన రమేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఎలాగైనా సరే సంకీర్ణ సర్కార్‌ను గట్టెక్కించేందుకు ఆయన పడరాని పాట్లు పడ్డారు. చివరి వరకు దానిని నిలబెట్టాలని చూశారు. తీరా కమలనాథులు రెబల్ ఎమ్మెల్యేలను ప్రభావితం చేయడం, తాయిలాలు ఎర చూపడంతో కథ మొదటికొచ్చింది....