అబ్బా కోలుకోలేని దెబ్బ..దిగ్గజ సంస్థ దివాళా..!

సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్రిటన్ కు చెందిన థామస్ కుక్ సంస్థ దివాళా తీసినట్తు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మందగమనం నెలకొన్నది. నిన్నటి దాకా ఇండియా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రభుత్వ బ్యాంకులు సైతం ఇప్పుడు ఆసరా కోసం ఎదురు చూస్తున్నాయి. దాదాపు 178 ఏళ్ళ ఘనమైన చరిత్ర కలిగి ఉన్నది థామస్ కుక్ కంపెనీకి. బెయిల్ అవుట్ ఇవ్వడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపక పోవడం గమనార్హం. ఈ ఒక్క డెసిషన్ తో 22 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. వారికి ఏవిధంగా ఉపాధి కల్పిస్తుందో వేచి చూడాలి. 1841 లో థామస్ కుక్ ప్రారంభమైంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రతి ఏటా దాదాపు 1000 కోట్ల పౌండ్లు ఆదాయం వచ్చేది. కానీ ఎప్పుడైతే మెట్రావల్ కంపెనీని కొనుగోలు చేసిందో ఇక అప్పటి నుంచి థామస్ కుక్ కోలుకోలేని స్థితికి దిగజారింది. పర్యాటక రంగంలో ఈ కంపెనీ తర్వాతనే ఏదైనా. సర్వీస్ ఇవ్వడంలోనూ, సౌకర్యాలను కల్పించడం లోను ఈ సంస్థ కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నది. కాగా ఆన్‌లైన్ పోటీ, బ్రెగ్...