హెచ్‌సీఏలో టెన్షన్ టెన్షన్..అధ్యక్ష పీఠం దక్కేదవ్వరికో

హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ లో ఎప్పుడూ లేనంతగా టెన్షన్ వాతాహవరణం నెలకొన్నది. బీసీసీఐకి అనుబంధంగా వున్న ఈ సంస్థలో సభ్యునిగా ఉండటం గొప్పగా భావిస్తారు. 200 మంది దాకా సభ్యులున్నారు. ఇప్పటికే హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా వున్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు గడ్డం వెంకట స్వామి తిరిగి తన పదవిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తునాన్రు. దీని కోసం మాజీ టీమిండియా సారథి మహమ్మద్ అజారుద్దీన్ హెచ్‌సీఏ ప్రెసిండెంట్ పదవి కోసం పోటీ పడ్డారు. ఈ ఒక్క అంశం దేశ వ్యాప్తంగా సంచలనం రేగింది. ఎందుకంటే వివేక్ అంటే కొందరికి మాత్రమే తెలుసు. కానీ అజారుద్దీన్ అంటే ప్రపంచంలోనే అత్యుత్తమైన రిస్టీ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నారు. కపిల్ దేవ్ తర్వాత ఇండియాకు ఎనలేని విజయాలు తెచ్చిపెట్టిన ఒకే ఒక్క సారథి, బ్యూటిఫుల్ బ్యాట్స్ మెన్ గా ఆయన వినుతికెక్కారు.

అతడు ఆడే విధానం ఇంకే ఆటగాడు ఆడలేక పోయారు ఇప్పటి దాకా. అతడికున్న టాలెంట్ వెరీ వెరీ డిఫరెంట్. అనుకోని రీతిలో అజ్జు భాయ్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కున్నాడు. బీసీసీఐ ఆయనపై జీవిత కాలం నిషేధం విధించింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తానేమిటో నిరూపించుకున్నాడు. ఏపీ హైకోర్టు తప్పు పట్టింది. ఎక్కడా ఆధారాలు చూపించక పోవడంతో ఈ రిస్టీ ప్లేయర్ మరోసారి నిషేధం నుంచి బయట పడ్డాడు. ఇండియాలోని క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఫీల్ అయ్యారు. ఈ మధ్యనే ఆయన చాలా మందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కొడుకును పోగొట్టుకున్న ఈ ఆటగాడు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడటం అందరిని విస్తు పోయేలా చేసింది. కానీ అజ్జూ కి హైదరాబాద్ అంటే వల్లమాలిన అభిమానం. ఈ మాజీ ఎంపీ ప్రస్తుతం ఎక్కడలేని పోటీని ఎదుర్కుంటున్నారు.

కాగా హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో ఎన్నికల వాతావరణం మరింత వేడిని పుట్టించింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రకియ్ర ముగియడంతో రేసులోని ప్రధాన పోటీదారులు ఎన్నికల ప్రచారానికి తెర తీశారు.అజరుద్దీన్‌ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిపై కన్నేయడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పోటీదారుడైన వివేక్‌ వెంకటస్వామి నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించడంతో పోటీ తీవ్రత తగ్గింది. గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న అజ్జూ భాయ్ ఈసారి పక్కాగా రంగం సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాడు. ఓ వైపు ప్రత్యర్థి వర్గంలోని ప్రముఖులను తమ వైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతూనే మరోవైపు తన కూటమి నుంచి ఎవరూ చేజారిపోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ మాజీ కెప్టెన్‌ నామినేషన్ల ప్రక్రియకు ముందే అర్షద్‌, శివ్‌లాల్‌ యాదవ్‌, శేష్‌ నారాయణ వర్గాల నుంచి మద్దతు కూడగట్టాడు.

నామినేషన్‌ తిరస్కరణతో మరోసారి అధ్యక్షుడు కావాలన్న వివేక్‌ వెంకటస్వామి కల భగ్నమైంది. అయితే, తన అనుకూల వర్గాన్ని పోటీలో ఉంచేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన వర్గంలోని కొందరితో నామినేషన్లు కూడా వేయించారు కూడా. కాగా అధ్యక్ష పదవి కోసం దిలీప్‌ కుమార్‌, మహ్మద్‌ అజరుద్దీన్‌, ప్రకా్‌షచంద్‌ జైన్‌ పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్ష పదవి కోసం కె.జాన్‌ మనోజ్‌, సర్దార్‌ దల్జీత్‌ సింగ్‌ తలపడతుండగా, కార్యదర్శి రేసులో ఆర్‌.ఎమ్‌ భాస్కర్‌, ఆర్‌.విజయానంద్‌, ఎస్‌. వెంకటేశ్వరన్‌ ఉన్నారు. సంయుక్త కార్యదర్శి స్థానం కోసం జె.శివాజీ , నరేష్‌ కుమార్‌ శర్మ, సతీ్‌షచంద్‌ శ్రీవాత్సవ్‌, కౌన్సిలర్‌ పదవి కోసం పి.అనూరాధ, రవీందర్‌ సింగ్‌, వినోద్‌ కుమార్‌ పోటీ చేస్తున్నారు. మొత్తం మీద అందరి కళ్ళు  హెచ్ సి ఏ ప్రెసిడెంట్ పదవిపై పడ్డాయి. ఎవరికి దక్కుతుందోనని వేచి చూస్తున్నాయి. 

కామెంట్‌లు