హైదరాబాద్ లో రియల్ బూమ్

ఇల్లు అన్నది ఒకప్పుడు కష్టసాధ్యమైన విషయం. కానీ ఇప్పుడు అలా కాదు. అది నిత్యావసరం. ఇది కాదనలేని సత్యం. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ సిటీగా హైదరాబాద్ కు పేరుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటు అయ్యాక, ఐటీ పరంగా నూతన కంపెనీలు పెట్టుబడులు పెట్టడం తో పాటు దిగ్గజ సంస్థలన్నీ నగరం జపం చేస్తున్నాయి. కొలువు తీరిన ప్రభుత్వం మొదటి ప్రయారిటీ ఇన్వెస్ట్ మెంట్ చేసే వారికి రెడ్ కార్పెట్ పరుస్తోంది. సకల సదుపాయాలు అందజేస్తోంది. దీంతో వందలాది కంపెనీలు కొలువు తీరాయి. మరికొన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో వేలాది మందికి ఇక్కడ ఉపాధి లభిస్తోంది. టెక్నాలజీలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గతంలో తప్పనిసరిగా ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అపరిమితమైన డేటా, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఆయా కంపెనీలు తమ ఇళ్లలో ఉంటూనే పని చేసే అవకాశాన్ని కల్పిష్తున్నాయి. దీంతో గృహాలకు భలే డిమాండ్ ఉంటోంది. పదేళ్ల కిందట వీటి ధరలు 40 లేదా 50 లక్షల్లో వుంటే ఇప్పుడు వాటి ధరలు మరింత పెరిగాయి. ఇప్పటికే 30 శాతానికి మించి పెరిగాయి. ప్రైమ్ లొకేషన్ లో అయితే కోటిన్నర నుంచి రెండు కోట్ల దాకా చేరుకున్నాయి. నోట్ల రాడ్డ్డుతో ...