పీసీ ముస్తఫా ..వారెవ్వా..ఐడి ఫ్రెష్..ఇండియన్ మార్కెట్‌లో టాప్..!

ఇండియన్ ఫుడ్ మార్కెట్‌లో ఐడీ ఫ్రెష్ సంచలనాలు సృష్టిస్తూ ..గణనీయమైన ఆదాయాన్ని గడిస్తూ ..కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. పీసీ ముస్తఫా ఈ పేరు చెబితే చాలు హీ వాజ్ ఏ క్రియేటర్. రూరల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ యువకుడి మదిలో మెదిలిన ఐడియా ఇపుడు డాలర్లను కొల్లగొడుతోంది. అతడికి వచ్చిన ఒకే ఒక్క ఆలోచన..చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం రోజూ బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా తినే పదార్థాలపై దృష్టి పెట్టారు. ఇడ్లి, దోశ, వడ, పరోటా ఐటమ్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు దుబాయి, అమెరికా, తదితర దేశాలకు విస్తరించింది ముస్తాఫా వ్యాపారం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని అతడిని చూస్తే తెలుస్తుంది. ప్రతి రోజూ వందలాది వాహనాలు ఈ ఐటమ్స్‌కు సంబంధించిన ప్యాకెట్లు సరఫరా అవుతుంటాయి. పీసీ ముస్తాఫా ..బెంగళూరు కేంద్రంగా ఐడీ ఫ్రెష్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. 16 వేల అవుట్ లెట్లను ఏర్పాటు చేశారు. ప్రతి చోటా ఐడీ ఫ్రెష్ ఉండేలా తీర్చిదిద్దారు. ఎవరైనా టిఫిన్లు వేడిగా అప్పటిక...