ఆన్‌లైన్ గేమింగ్‌ను షేక్ చేస్తున్న హిట్‌వికెట్
డిజిటల్ మీడియా పుణ్యమా అంటూ ఇండియాలో ఎక్కడలేని స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని అంకురాలు నిలబడితే మరికొన్ని టాప్ పొజిషన్ లో ఉంటున్నాయి. దేశంలో లెక్కలేనన్ని ఆటలు ఉన్నప్పటికీ క్రికెట్ ఆటకున్నంత క్రేజ్ ఇంకే ఆటకు లేదు. ఈ ఒక్క ఆటను బేస్‌గా చేసుకుని వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు, వ్యాపారులు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్, బిజినెస్ టైకూన్స్ , డిజైనర్స్, ఆటగాళ్లు సైతం తమ కలలకు రెక్కలు తొడుగుతున్నారు. పురుషులకు ధీటుగా గేమింగ్ విభాగంలో ఓ మహిళ ఊహించని రీతిలో సక్సెస్ స్వంతం చేసుకుంది. హిట్‌వికెట్ కో ఫౌండర్ కీర్తిసింగ్. ఈ ప్రారంభించిన మొబైల్ గేమింగ్ స్టార్టప్ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడిస్తోంది. దీనికంతటికీ ఆమె పెట్టిన ఎఫర్ట్స్. చిన్పప్పటి నుంచి కీర్తి సింగ్‌కు క్రికెట్ అంటే చచ్చి పోయేంత ప్రేమ..ఇష్టం కూడా. చదువుపై కాన్‌సెంట్రేషన్ చేస్తూనే మరో వైపు వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్ ఆట గురించి కుటుంబీకులతో పాటు ఇంటికి వచ్చే వారిని, ఎక్స్ పర్ట్స్‌ను అడిగి తెలుసుకునేది. ఈ ఉత్సుకతనే ఆమెను ఆంట్రప్రెన్యూర్‌గా మార్చేలా చేసింది.
రాను రాను ఆమెకు ఆట తప్ప మరో ధ్యాస లేకుండా పోయింది. తమిళనాడులోని వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిటెక్ చదివింది. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో గేమింగ్ అనే దానిపై దృష్టి పెట్టింది. నాలెడ్జ్‌తో పాటు స్టడీలో కూడా టాప్ రేంజ్‌లో ఉండడంతో బీటెక్ పూర్తయ్యాక..ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ చేసింది. రోజూ చదువు వత్తిడిని తాను క్రికెట్ చూడడం వల్ల తగ్గించు కోగలిగానని కీర్తి సింగ్ స్పష్టం చేసింది. క్రికెట్ ఆట పట్ల ఉన్న మక్కువనే తనను డిఫరెంట్‌గా ఆలోచించేలా చేసిందని తెలిపింది. ఐఎస్‌బీలో కూడా ఆమెకు క్రికెట్‌పై మోజు పెరిగిందే కానీ తగ్గలేదు. తన లాంటి వారు కోట్లల్లో ఉన్నారు. పిల్లలు, పెద్దలు, పురుషులు, మహిళలు..వీరందరు లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి స్ట్రెస్ కు లోనవుతూనే ఉంటారు. ఆ స్ట్రెస్ ను తగ్గించాలంటే క్రికెట్ గేమింగ్ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ఆమె నమ్మారు. అదే ఐడియాను వర్కవుట్ చేసేందుకు ప్లాన్ చేశారు.
ఐఎస్‌బీలో ఎంబీఏ పూర్తి చేశాక..అమెరికా కంపెనీ అమెజాన్ బిగ్ ఆఫర్ చేసింది కీర్తి సింగ్‌కు. అక్కడ క్రియేటివిటికి పెద్ద పీట వేయడంతో తనలోని కోరికలకు రెక్కలు తొడిగేలా చేసింది. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్..ప్రతి దానిలో గేమ్స్ చూడడం అలవాటుగా మార్చుకుంది. గోల్ఫ్ క్లాష్ టు యాంగ్రీ బర్డ్స్..గేమ్స్ చూస్తూనే ..గడపడం నేర్చుకుంది. ప్రతి సారి ఏడుసార్లు ఆడడం రివాజుగా మారిందంటారు ఆమె. మెల మెల్లగా ఆన్‌లైన్‌లో చూడడం వల్ల తనలో ఎనలేని ఎనర్జీ చోటు చేసుకుందని తెలిపింది. ఆన్‌లైన్ గేమింగ్‌లో దుమ్ము రేపుతున్న క్యాండీ క్రష్ టీమ్‌ను కీర్తి సింగ్ కలిసింది.2015లో ఏకంగా హిట్‌వికెట్ పేరుతో స్టార్టప్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేసింది. ఈ కామర్స్ బిజినెస్ కింద దీనిని డెవలప్ చేసింది. తనతో పాటు చదువుకున్న కాష్యప్ రెడ్డి ఆమెలోని కసిని గుర్తించాడు. ఇద్దరూ కలిసి ఈ అంకుర సంస్థలో పాలు పంచుకున్నారు. 32 ఏళ్ల వయసున్న కీర్తి సింగ్ ..హయ్యస్ట్ శాలరీ వస్తున్న జాబ్‌ను వదిలి వేయడంతో ఆమె పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. జాబ్ కంటే తన స్టార్టప్ బెటర్ అంటూ ఆమె రిస్క్‌ను ఫేస్ చేసేందుకు రెడీ అయ్యారు. నేను ఉద్యోగిగా ఉండదల్చుకోలేదు..
నాలాంటి టాలెంట్ కలిగిన వారందెరో ఉన్నారు. వారందరికి నేను అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకే హిట్‌వికెట్ గేమింగ్ రూపొందించానని కీర్తి సింగ్ వెల్లడించారు. ఆమె తయారు చేసిన ఈ గేమింగ్‌ను 100 దేశాలకు విస్తరించింది. 2.1 మిలియన్లు గేమింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో అరుదైన రికార్డు. ప్రతి రోజు 32 నిమిషాల పాటు ఈ ఆటను మొబైల్‌లో వీక్షిస్తున్నారు. క్రికెట్ ఆడే దేశాలతో పాటు 200 నగరాలలో దీనిని వీక్షిస్తున్నారు. 2018లో గూగుల్ గేమ్ ఆక్సిలేటర్ ఏషియా ప్రోగ్రామింగ్ కింద హిట్ వికెట్ ను ఎంపిక చేయడం ఆమె ప్రతిభకు దక్కిన గౌరవంగా భావించాలి. హిట్ వికెట్ సూపర్ స్టార్స్ ను 1 లక్ష 30 వేలు డౌన్లోడ్ చేసుకున్నారు 48 గంటల్లో. 30 శాతం మంది ఆస్ట్రేలియా, యుకె, యుఎస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, తదితర దేశాలలో ఈ హిట్ వికెట్‌కు క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏడాది రన్ రేట్ 4.6 మిలియన్లుగా నమోదైంది. అమెజాన్‌లో పనిచేయడం తనకు ఎంతగానో ఉపయోగపడిందని కీర్తి సింగ్ అంటోంది. స్టార్టప్ రంగంలో దూసుకెళుతున్న హిట్‌వికెట్‌లో భారీగా పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఆమె సాధించిన ఈ విజయం ఎందరో మహిళలకు స్ఫూర్తి కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి