వారెవ్వా...డిజిట‌ల్ మీడియా..టాలెంట్ వుంటే..కోట్లే కోట్లు..!

టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ డిజిట‌ల్ మీడియా ఊహించ‌ని రీతిలో, మార్కెట్ వ‌ర్గాల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. ప్రింట్, మీడియా రంగాలకు ధీటుగా ఎదుగుతోంది. సాంకేతిక ప‌రిజ్ఞానంలో స‌మూల‌మైన మార్పులు చోటు చేసుకోవ‌డం, ఇంట‌ర్నెటి క‌నెక్టివిటీ పెర‌గ‌డం, డిజిట‌ల్ టెక్నాల‌జీకి ప్ర‌యారిటీ ఉండ‌డంతో ఈ రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఆఫ్ లైన్‌లో కంటే ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ ప్ర‌పంచ మంత‌టా చాప కింద నీరులా విస్త‌రించింది. ఇటీవ‌ల ఇంట‌ర్నెట్ వినియోగ‌దారులు అత్య‌ధికంగా పెర‌గ‌డం కూడా ఇందుకు కార‌ణం కావ‌చ్చు. ఆన్‌లైన్ వీడియోల‌తో పాటు ఆడియో సేవ‌ల‌కు డిమాండ్ అధికంగా ఉంటోంది. దేశీయ డిజిట‌ల్ మీడియా రంగం ఈ ఏడు ఎంట‌ర్‌టైన్మెంట్ రంగాన్ని దాట‌వ‌చ్చ‌ని ఫిక్కీ-ఈవైలు వెల్ల‌డించాయి.

వ‌చ్చే రెండేళ్ల‌లో ప్రింట్, మీడియాను దాటేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. 510 కోట్ల డాల‌ర్లు అంటే ఇండియ‌న్ రూపీస్ అయితే అక్ష‌రాల 35 వేల 700 కోట్లు అన్న‌మాట‌. గ‌త ఏడాదిలో 17 వేల 500 కోట్లు న‌మోదైన సినిమా ఇండ‌స్ట్రీ ఈ ఏడాది మ‌రో 2 వేల కోట్లు పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా. 2018లో 440 కోట్ల డాల‌ర్లుంటే అంటే 30 వేల 800 కోట్లు ఉన్న ప్ర‌చుర‌ణ , మీడియా రంగం 2021 నాటికి 480 కోట్ల డాల‌ర్ల‌కు చేరుకోనుంద‌న్న‌మాట‌. దీని విలువ సుమారు 33 వేల 600 కోట్లు. గ‌త ఏడాది డిజిట‌ల్ మీడియా మార్కెట్ 42 శాతం వృద్ధితో 240 కోట్ల డాల‌ర్ల‌కు చేరుకుని.16 వేల 800 కోట్ల వ‌ద్ద ఆగింది. వ‌చ్చే రెండేళ్ల‌లో 360 కోట్ల డాల‌ర్ల‌కు పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేశాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే ఇండియ‌న్స్ భారీ ఎత్తున స్మార్ట్ ఫోన్ల‌లోనే జీవితాన్ని గ‌డిపేస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశం. ఒక స‌ర్వే ప్ర‌కారం 30 శాతం వినోదంలో మునిగి పోయార‌న్న‌మాట‌.

భార‌త‌దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికిప్పుడు ప‌రిశీలిస్తే..57 కోట్ల‌కు పైగా మంది ఇట‌ర్నెంట‌ర్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటున్నారు.ప్ర‌తి ఏటా 13 శాతానికి పైగా పెరుగుతూ వ‌స్తోంది. గ‌త ఏడాది ఇండియాలో ఆన్‌లైన్‌లో వీడియాలోను చూసే వారి సంఖ్య 32.5 కోట్లు న‌మోదు కాగా. మ్యూజిక్‌, త‌దిత‌ర ఆడియో సేవ‌లు వినియోగించుకున్న వారు 15 కోట్లు పెరిగారు. ఇది కూడా ఓ రికార్డే. గ‌త ఏడాది అడ్వ‌ర్‌టైజింగ్ ఆధారిత ఓటీటీ వీడియోలు, ఆడియో సేవ‌ల విలువ అమాంతం 220 కోట్ల డాల‌ర్ల‌కు చేరుకుంది. వీటి విలువ 15 వేల 400 కోట్లు అన్న‌మాట‌. వ‌చ్చే ఐదేళ్ల‌లో ఆన్‌లైన్‌లో వీడియోలు చూసే వారి సంఖ్య మ‌రింత పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా. 60 శాతానికి పైగా టెలికాం ఆప‌రేట‌ర్ల క‌స్ట‌మ‌ర్ల ద్వారానే మార్కెట్ జ‌రుగుతుండ‌డం విశేషం. ఆన్‌లైన్‌లో గేమింగ్ వీడియోలు త‌మ హ‌వాను కొన‌సాగిస్తున్నాయి. మొత్తం మీద డిజిట‌ల్ మీడియా చంద్ర‌యాన్ -2 కంటే వేగంగా దూసుకెళ్ల‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది. 

కామెంట్‌లు