ఆగని వర్షాలు..కళకళలాడుతున్న ప్రాజెక్టులు

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల దెబ్బకు వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నదులు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో నారాయణపూర్, ఆల్మట్టి ల నుంచి వరద రావడంతో కృష్ణమ్మ ధాటిగా ప్రవహిస్తోంది. పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ప్రమాద స్థాయిని దాటింది. దీంతో అధికారులు ఆరు గేట్లను ఎత్తేశారు. ఈ నీళ్లన్నీ శ్రీశైలం ప్రాజెక్టుకు తరలిపోతున్నాయి. పాతికేళ్ల తర్వాత ఐదు సార్లు శ్రీశైలం గేట్ల ద్వారా నీళ్లను వదిలారు. అక్కడి నుండి దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వదిలారు. మొత్తం అరవై రోజుల్లో ముప్పై రోజుల పాటు నీళ్లను విడుదల చేశారు. 28029 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి 80000 వేల క్యూసెక్కుల వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గత ఆగస్టు నెలలో 13 సార్లు నీటిని విడుదల చేశారు. సెప్టెంబర్ లో ఏడు రోజులు, ఈ నెలలో నీటిని విడుదల చేస్తూ వచ్చారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 884 అడుగుల మట్టంతో 215 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. భారీగా నీరు నిండుకోవడంతో అటు విద్యుత్ ఉత్పత్తితో పాటు కింది కాలువలకు నీటిని విడుదల చేస్తున్న...