మేధస్సుకు పరీక్ష..ఉపాధికి శ్రీరామరక్ష

కాస్తంత తెలివి తేటలు ఉంటే చాలు..ఎక్కడి నుండైనా ..ఎన్ని కోర్సులైనా నేర్చుకోవచ్చు. ఇంటి నుండే పాఠాలు..టీచర్లు..శిక్షకులు అవగాహన కల్పిస్తారు. మిమ్మల్ని అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన స్టూడెంట్స్‌గా తీర్చిదిద్దుతారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన స్వయం ..పథకం భరోసా కల్పిస్తోంది. ఏ కోర్సు అయినా చేయాలంటే సవాలక్ష ఇబ్బందులు. కానీ అవేవీ వీటికి అడ్డు కాదు. ఓపెన్ స్కూల్ నుంచి క్లౌడ్ టెక్నాలజీ వరకు అన్ని ఆన్‌లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ధృవీకరణ పత్రాలు, క్రెడిట్ స్కోర్ పొందేందుకు వీలు పడుతుంది. ఐఐటీ, ఐఐఎం, ఫారిన్ యూనివర్శిటీల నుంచి బోధన కూడా ఇందులోనే లభిస్తోంది. కాలం మారింది. టెక్నాలజీలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మెరుగైన ఫ్యూచర్ కు ..పునాది వేసుకునేందుకు ఈ కోర్సులు దోహద పడతాయి. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేంద్ర మానవ వనరుల శాఖ కోర్సులు రూపొందించింది. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారి కోసమే వీటిని తయారు చేశారు. ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన పనిలేదు. ప్రఖ్యాత సంస్థలు ఆధునిక కోర్సులకు ప్రణాళికలు, సి...