నో కంట్రోల్..పోర్న్ హల్ చల్

లోకమంతటా అంతర్జాలంలో బూతు రాజ్య మేలుతోంది. క్లిక్ చేస్తే చాలు కుప్పలు తెప్పలుగా పోర్న్ దర్శనమిస్తోంది. వీటి బారిన పడిన వారంతా అది చూడ లేకుండా ఉండలేక పోతున్నారు. చిన్నారులు, మహిళలు, పురుషులు, వృద్దులు, యూత్ అంతా బూతు తోనే గడుపుతున్నారు. ఎప్పుడైతే నెట్ అందుబాటు లోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి కోట్లాది ఫోటోలు, వీడియోలు, వెబ్ సైట్స్ హల్ చల్ చేస్తున్నాయి. జనాన్ని జలగల్లా పీల్చుకు తింటున్నాయి. ఒక్కసారి దీనికి అడిక్ట్ అయితే ఇక లైఫ్ అంతా నాశనం అయినట్లే. ఈ పోర్న్ దెబ్బకు కుటుంబాలు కూలి పోతున్నాయి. సంస్కృతి చిన్నా భిన్నమవుతోంది. బంధాలు పలచనవుతున్నాయి. ఏదైనా సమాచారం కావాల్సి వెదికితే చాలు ఇక అంతా బూతే దర్శనమిస్తోంది. ఇది ఒక రకంగా టెక్నాలజీ మాయాజాలం. ప్రతి రోజుకు కోట్లల్లో వీడియోలు డౌన్లోడ్ అవుతున్నాయి. పోర్న్ స్టార్స్ కు ఎనలేని క్రేజ్ ఉంటోంది. వీరు నటిస్తూనే డాలర్లు పోగేసుకుంటున్నారు. ఎప్పుడైతే నెట్ కనెక్టివిటీ పెరిగిందో ఇక అప్పటి నుంచి బూతుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక సినిమాల గురించి చెప్పాల్సిన పని లేదు. అవి కూడా సెక్స్ ను పెంచి పోషిస్తున్నాయి. నాలుగు గోడల మధ్యన ఉండాల్సిన శృంగారం...