ఆ ఒక్కటి వద్దంటున్న ముద్దుగుమ్మ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ నటీమణిగా కాజల్ అగర్వాల్ కొనసాగుతోంది. ఈ అమ్మడి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ మెప్పిస్తోంది. సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న ఈ అమ్మడు పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం, ఆ ఒక్కటి అడుగొద్దంటూ ముసిముసి నవ్వులు నవ్వుతోంది. తాజాగా ఈ ముంబై బ్యూటీ గురించి ఇటీవల పలు రకాలుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. నటిగా దశాబ్దంన్నరకు చేరు కోవడంతో పెళ్లిపై ప్రచారం జరుగుతోంది. ఒక పారిశ్రామిక వేత్తతో ఏడడుగులు నడవడానికి సిద్ధం అవుతోందని వైరల్ అవుతోంది.
ముఖ్యంగా ఇండియన్–2 చిత్రంలో కాజల్ అగర్వాల్ 85 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తోందని సామాజిక మాధ్యమాల్లో టాక్. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ చిత్రాలకు సంబంధించిన వివరాలు అంత సులభంగా బయటకు రావు. అలాంటిది కాజల్ అగర్వాల్ పాత్రకు సంబంధించిన విషయాలు బయటకు రావడానికి ఒక రకంగా తనే కారణం. అగ్ర నటుడు కమల్ హాసన్ కథా నాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇండియన్–2. ఈ చిత్రంలో నటించే విషయం గురించి నటి కాజల్ అగర్వాల్ ఎక్కువగా ప్రచారం చేసుకుంటోంది. దీంతో ఆమె పాత్ర గురించి ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి.
ఈ బ్యూటీ ఇటీవల ఇండియన్–2 చిత్రం కోసం ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఈ చిత్రంలో కమలహాసన్ ఇండియన్ పాత్ర ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు జంటగా నటి కాజల్ అగర్వాల్ 85 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం నిజమేనని చెప్పింది. ఈ నెలలో తైవాన్‌లో జరగనున్న చిత్ర షూటింగ్‌లో తాను పాల్గొంటున్నట్లు వెల్లడించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి