తలైవాకు అరుదైన గౌరవం
భారతదేశంలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్న రజనీకాంత్ కు అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2019 అవార్డ్స్‌లో `ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ` అవార్డ్‌తో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. కొన్ని దశాబ్దాలుగా తన నటనతో ఇండియన్ సినిమాకు రజనీకాంత్ చేసిన సేవలకు ఈ అవార్డును ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ప్రకాష్ జవదేకర్ తెలిపారు. వచ్చే 20 నుండి 28 వరకు గోవాలో ఈ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది.
వివిధ దేశాలకు చెందిన 250 సినిమాలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. కాగా రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. కండక్టర్ గా కొద్ది కాలం పని చేశారు. ఆయన స్వస్థలం కర్ణాటక. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. ఆయన పేరును ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ రజనీకాంత్ గా మార్చారు. జన్మతః మరాఠీ యాదవ కులంలో 1950 డిసెంబర్ 12వ తేదీన జన్మించారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుడిగా పేరు పొందారు. ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ ను అభిమానులు ఆప్యాయంగా తలైవా అని పిలుచుకుంటారు.
ఆయన చిటికేస్తే చాలు లక్షలాది మంది తరలి వస్తారు. రజనీకాంత్ కు తమిళనాడు లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఇండియా వ్యాప్తంగా, జపాన్, అమెరికా, చైనా, సింగపూర్, తదితర దేశాలలో అభిమానులకు లెక్కలేదు. మొదటి సినిమా ఆపూర్వ రాగంగళ్ . ఇందులో కమల్ హాసన్, సుందర్రాజన్, జయసుధ, శ్రీవిద్య తో కలిసి నటించారు రజనీకాంత్. ఇక వెను తిరిగి చూడలేదు తలైవా. ప్రస్తుతం దర్బార్ సినిమా విడుదల కావాల్సి ఉంది. కోట్ల రూపాయలు సంపాదించినా అత్యంత సాధారణ జీవితం గడపడం ఆయనకే చల్లింది. ప్రతి ఏటా హిమాలయాలకు వెళతారు. అంతే కాకుండా మంత్రాలయంలో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి అంటే అభిమానం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి