రంగస్థలం రీమేక్ కానుందా..?


తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రంగా రంగస్థలం నిలిచింది. దీనికి క్రియేటివ్  డైరైక్టర్ సుకుమార్ డైరెక్షన్ చేశారు. ఇందులో రామ్ చరణ్, సమంత, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనుక్కన్న దాని కంటే భారీగా వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. అప్పటి దాకా కమర్షియల్ సినిమాలకే పరిమితమైన చరణ్ కు అద్భుతమైన కేరెక్టర్ ఇచ్చాడు సుకుమార్. ఎవరికి వారు ఇందులో పోటీపడి నటించారు. ఈ సినిమా కథా పరంగా, సంగీత పరంగా జనాన్ని ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున అవార్డులు దక్కించుకుంది రంగ స్థలం.

తాజాగా ఇదే సినిమాను తమిళ్, హిందీలో రీమేక్ చేసేందుకు డైరెక్టర్ లారెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. నటి సమంతకు మంచి పేరు వచ్చింది ఈ సినిమా. కాగా ఈ చిత్ర తమిళ రీమేక్‌ హక్కులను రాఘవ లారెన్స్‌ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన నటించిన కాంచన–3 మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌ చేస్తానని రాఘవ లారెన్స్‌ ఇటీవలే ప్రకటించారు కూడా. ప్రస్తుతం కాంచన చిత్రాన్ని అక్షయ్‌కుమార్‌ హీరోగా హిందీలో చేసే పనిలో బిజీగా ఉన్నారు. నటి కియారా అద్వాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీబాంబ్‌ అనే పేరును నిర్ణయించారు.

ఇంతకు ముందు తెలుగులో హిట్‌ అయిన పటాస్‌ చిత్ర తమిళ రీమేక్‌లో లారెన్స్‌ నటించారన్నది గమనార్హం. మొట్ట శివ కెట్ట శివ పేరుతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. తాజాగా రంగస్థలం చిత్ర రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారక ప్రకటన ఏదీ రాలేదు. ప్రస్తుతం హిందీ చిత్రం లక్ష్మీ బాంబ్‌ను పూర్తిచేసే పనిలో లారెన్స్‌ బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాతే రంగస్థలం రీమేక్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!