యెడ్డీ ఆడియో వైరల్..హల్ చల్
కర్ణాటకలో అతి కష్టం మీద అధికారం లోకి వచ్చినా, ఆ సంతోషం ఎక్కువ సేపు ఉండడం లేదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ హై కమాండ్ యెడ్డీకి కుర్చీ అప్పగించింది. మోడీ, అమిత్ షా కు సుతారమూ ఇష్టం లేదు. అయినా తప్ప లేదు. ఏ మాత్రం వీలు చిక్కినా తప్పించాలని చూస్తున్నారు. అదును కోసం వెయిట్ చేస్తున్నారు వీరిద్దరూ. ఇదిలా ఉండగా ఇటీవల ఒకవేళ బీజేపీ సర్కారు కూలి పోతే తాము మద్దతు ఇస్తామంటూ జేడీఎస్ అధినేత కుమార స్వామి ప్రకటించారు.
దీంతో యెడ్డీ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంత లోపే యెడ్డీకి మరో తలనొప్పి వచ్చి పడింది. అదేమిటంటే ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చేలాగా ఉన్నాయి. ఆ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చే సమయంలో యడ్యూరప్ప బీజేపీ నేతలతో మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ విషయంపై బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ, ముంబైలోని హోటల్‌లో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల విషయం అమిత్‌షాకు తెలుసు. వారే పూర్తిగా చూసుకుంటారు అని అన్నారు. అన్ని ఏర్పాట్లూ చేశారు. 17 మంది రెబల్స్ ఎమ్మెల్యేల విషయం ఆయనే చూసుకుంటారు. పార్టీ అవసరాల దృష్ట్యా అందరికీ మద్దతివ్వాలని చెప్పానన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి