సేతుపతికి చిరు వ్యాపారుల ఝలక్
అభిమానం ఒక్కోసారి కొంప ముంచుతుంది. ఒక్కోసారి స్టార్ డమ్ ఇబ్బందులకు గురి చేస్తుంది. తమిళనాడులో ఏది జరిగినా అది సంచలనమే. ఎందుకంటే తమిళులు దేనినైనా భరిస్తారు. కానీ తమ ఆత్మాభిమానం దెబ్బ తిన్నా లేదా తమ భాషను కించ పరిచినా తట్టు కోలేరు. ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ కు అనుభవం లోకి వచ్చింది కూడా. తాజాగా మరో నటుడు విజయ్ సేతుపతికి ఈసారి ఫ్యాన్స్ నుండి కాక చిరు వ్యాపారస్తుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అంతే కాకుండా తన ఇల్లు ముట్టడించాలని కూడా డిసైడ్ అయ్యారు వ్యాపారులు.
కారణం విజయ్ ఓ వాణిజ్య ప్రకటనలో నటించడమే వీరి కోపానికి కారణమైంది. నటుడిగా సేతుపతి ఇప్పుడు మంచి ఫామ్‌లో వున్నాడు. ఆన్‌లైన్ వ్యాపారం కోసం ఒక వ్యాపార సంస్థ మండి పేరుతో ఓ యాప్ రూపొందించింది. ఆ యాప్‌లో చిరు వ్యాపారులను దెబ్బ కొట్టేలా సేతుపతి నటించారు. దీనిని వ్యాపారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయ్ ఇంటిని ముట్టడించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కాగా దీనిపై తమిళనాడు వ్యాపార సంఘాల నిర్వాహకులు స్పందించారు. చిరు వ్యాపారులకు నష్టం కలిగించే ఏ విషయాన్ని తాము అనుమతించమని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ వ్యాపారం పేరుతో బడా సంస్థలు జనాన్ని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కాగా ప్రజలకు బాధ కలిగించే వ్యాపార ప్రకటనల్లో నటించే ముందు నటీ నటులు ఆలోచించాలని హితవు పలికారు. నటుడు సేతుపతి అంటే తమకు గౌరవం ఉందని, అయితే వ్యాపారులను బాధించే లా నటించడాన్ని మాత్రం తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారం సీరియస్ కావడం తో సేతుపతి ఫాలోయర్స్ స్పందించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏపనీ తమ నటుడు చేయరని వెల్లడించారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాడులో సంచలనం రేపుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి