పోస్ట్‌లు

నవంబర్ 12, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సౌందర్యకు దేశం సలాం

చిత్రం
ఎవరీ సౌందర్య అనుకుంటున్నారా. తమిళనాడులోని విరుధూనగర్ లోని సేతు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఇప్పుడు దేశమంతటా వైరల్ గా మారింది. తన ప్రసంగంతో ఆకట్టుకుంది. దేశం యావత్తు ఈ అమ్మాయి ఎవరు..అంటూ గూగుల్ లో వెతుకుతోంది. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్ కు దేశం బాగు పడాలంటే ఏం చేయాలి అనే అంశంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. పలు దిగ్గజ కంపెనీలకు చెందిన సీనియర్లు, మేనేజింగ్ డైరెక్టర్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొందరు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎంచుకుంటే, సౌందర్య మాత్రం దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగం పైనా, దీనిపైనే ఆధారపడిన రైతుల గురించి ప్రసంగించింది. చదువు పూర్తి కాకా ముందే వీసా కోసం, అమెరికె వెళ్లి పోవాలని, డాలర్స్ కొల్లగొట్టాలని ఆలోచించే వారికి చెంప చెల్లు మనిపించేలా చేసింది సౌందర్య. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు, చెప్పిన పదాలు, ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు సంచలనం కలిగించాయి. ఎంతో పరిణితితో, ఉదాహారణలతో, సమగ్ర సమాచారంతో అనర్గళంగా, ఎక్కడా తొట్రుపాటుకు గురి కాకుండా సౌందర్య చేసిన ప్రసంగం ప...

కరుణామయుడికి కీలక పోస్ట్

చిత్రం
తాను మాటలు చెప్పనని, చేసి చూపిస్తానని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. తాను అధికారం లోకి వచ్చాక, తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి సముచితమైన గుర్తింపు ఇస్తున్నారు.  వారు జీవితంలో మరిచి పోలేని రీతిలో సత్కరిస్తున్నారు. ఆయన తన పాలనలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పూర్తి పారదర్శకత ఉండేలా దృష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా తన సుదీర్ఘ రాజకీయ ప్రజా పాదయాత్రతో పాటు కష్టకాలంలో తనను వీడి పోకుండా, తన వెంటే ఉంటూ రేయింబవళ్లు శ్రమించిన వారందరికి మొదటి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు జగన్ మోహన్ రెడ్డి. ఈ విషయంలో దేశంలోని మిగతా సీఎంల కంటే జగన్ ముందంజలో ఉన్నారు. ఇక తెలుగు సినిమా రంగంలో అరుదైన పాత్రలతో నటించి, మెప్పిస్తూ వచ్చిన కరుణామయుడు, సాయిబాబా, యేసు క్రీస్తు పాత్రలో ఒదిగి పోయేలా పేరు తెచ్చుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, నటుడు తెలిదేవర విజయ్‌ చందర్‌కు కీలక పదవి దక్కింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ప్రభుత్వం ఉత్తర్వులు వెంటనే జారీ చేసిం...

బంగ్లాకు షోయబ్ కితాబు

చిత్రం
టీమిండియాతో బంగ్లా క్రికెట్ జట్టు గట్టి పోటీ ఇచ్చిందని, మెరుగైన ఆటతీరు ప్రదర్శించిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలై, మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్‌ జట్టును కూడా పొగిడారు. మూడో టీ20లో అద్వితీయ ప్రదర్శనను కనబరచడంతో టీమిండియాను బాస్‌ ఆఫ్‌ ద గేమ్‌ అంటూ ప్రశంసించారు. టీమిండియా సమిష్ట ప్రదర్శనతో సిరీస్‌ను గెలుచుకుంది. రోహిత్‌లో అసాధారణ బ్యాటింగ్‌ టాలెంట్‌ ఉంది. అతను పరుగులు చేయాలని ఏ సందర్భంలో అనుకున్నా సాధిస్తాడు. చివరి టీ20 ఆసక్తికరంగా ఉంటుందనుకున్నా. కానీ భారత్‌ ఒక్కసారిగా విజృంభించడంతో హోరా హోరీ మ్యాచ్‌ కాస్తా ఏకపక్షంగా మారి పోయింది. ఇక్కడ బంగ్లాదేశ్‌ ఆటను తక్కువ చేయలేం. బంగ్లాదేశ్‌ సిరీస్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. భారత్‌కు కచ్చితంగా గట్టి పోటీ ఇచ్చింది. హ్యాట్సాఫ్‌ బంగ్లాదేశ్‌. బంగ్లా పసికూన కాదనే విషయం మరోసారి రుజువైంది. బంగ్లా పులులు ఏ జట్టు ముందైనా అంత తేలిగ్గా తలవంచరు. ప్రతీ జట్టుకు గట్టిపోటీ ఇస్తూ బంగ్లాదేశ్‌ పటిష్టమైన జట్టుగా ఎదిగి...

గవర్నర్ అసాధారణ నిర్ణయం

చిత్రం
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి మరింత ఆజ్యం పోస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో, అన్ని ప్రధాన పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. మరాఠాలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి సిఫారసు లేఖ రాశారు. దీంతో ఒక్కసారిగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ రూల్ విధించేందుకు సమ్మతి కూడా తెలిపినట్లు సమాచారం. దీనిపై శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మండి పడ్డారు. అయితే తమకు ఇంకా కొన్ని గంటల సమయం ఉందని, ఈ సమయంలో ఏకపక్షంగా ఎలా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని ఎన్సీపీ ఫైర్ అయ్యింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా గడువు మిగిలి ఉండగానే ఇలాంటి డిసిషన్ తీసుకోవడం పూర్తిగా రాజ్యంగా విరుద్ధమన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే. ఈ మేరకు ఆయన ఇప్పటికే ఫోన్ లో కాంగ్రెస్ సీనియర్ లీడర్, అడ్వొకేట్ కపిల్ సిబల్, అహ్మద్ పటేల్ తో మాట్లాడారు. అంతకు ముందు అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్ల...