కరుణామయుడికి కీలక పోస్ట్
ఈ విషయంలో దేశంలోని మిగతా సీఎంల కంటే జగన్ ముందంజలో ఉన్నారు. ఇక తెలుగు సినిమా రంగంలో అరుదైన పాత్రలతో నటించి, మెప్పిస్తూ వచ్చిన కరుణామయుడు, సాయిబాబా, యేసు క్రీస్తు పాత్రలో ఒదిగి పోయేలా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నటుడు తెలిదేవర విజయ్ చందర్‌కు కీలక పదవి దక్కింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ప్రభుత్వం ఉత్తర్వులు వెంటనే జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విజయ్ చందర్ కరుణామయుడుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు. అలాగే సాయిబాబాగా కూడా ఆయన తన నటనతో మెప్పించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విజయ్ చందర్‌కు స్వయానా తాత అవుతారు. కాగా ఇది వరకే తన కోసం పని చేసిన, సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటులు రోజా, ఆలీ, పృథ్వీ రాజ్ కు ఇప్పటికే కీలక పదవులు అప్పగించైనా విషయం తెలిసిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి