దాదాకు లిటిల్ మాస్టర్ ప్రసంశ

భారతీయ క్రికెట్ దిగ్గజ ఆటగాడిగా పేరున్న మాజీ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ బిసిసిఐ కి ప్రెసిడెంట్ కాబోతున్న సౌరబ్ గంగూలీ ని ప్రసంశలతో ముంచెత్తాడు. క్రికెట్ ను ఎంతగా ఆస్వాదిస్తూ..అభిరుచితో ఆడాడో అలాగే నిసిసిఐ ని నడిపిస్తాడన్న నమ్మకం తనకు ఉందని చెప్పాడు. మరో వైపు ఈనెల 23 న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు అధ్యక్షుడిగా పూర్తిగా బాధ్యతలు చేపట్ట బోతున్నాడు బెంగాలీ టైగర్. ఇండియన్ క్రికెట్ పాలనలో గంగూలీ తప్పనిసరిగా సక్సెస్ అవుతాడన్న నమ్మకం తనకు ఉందన్నారు సచిన్. గంగూలీ క్రికెట్ ను ఎలా ఆడాడో, దానిని వదిలి వేశాక ఎలా క్రికెట్ కు సేవలు అందించాడో ప్రతి ఒక్కరికి తెలుసు. అతడు మైదానంలో ఉన్నా లేదా బయట ఎక్కడ ఉన్నా క్రికెట్ కోసమే పని చేశాడు. చేస్తూనే ఉన్నాడు కూడా. అతడు పూర్తిగా కమిట్మెంట్ ఉన్న ప్లేయర్ అని స్పష్టం చేశాడు ఈ లిటిల్ మాస్టర్. శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్ కూడా గంగూలీ పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లీగ్ ఆవిష్కరణ సందర్బంగా సచిన్, దిల్షాన్ లు మాట్లాడారు. సెహ్వాగ్, జెహెర్ ఖాన్, ఆర్ఫీ సింగ్, అజిత్ అగార్కర్ తో కూడిన జట్టును సచిన్ నడిపించనున్న...