దోస్త్ మేరా దోస్త్..కంగ్రాట్స్ దాదా
భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు కు ప్రెసిండెట్ కాబోతున్న మాజీ సారథి గంగూలీకి దేశమంతా అభినందనలు అందుతున్నాయి. అంతే కాకుండా టీమిండియాకు ఎనలేని విజయాలు అందించిన ఘనత సౌరభ్ దే. ఇదే సమయంలో గంగూలీ సారథ్యంలో ఆటగాడిగా, అపురూపమైన విజయాలలో భాగస్వామ్యం పంచుకున్నహర్భజన్ సింగ్ అంటే గంగూలీకి చాలా ఇష్టం. వీరిద్దరూ మంచి దోస్తులు. దాదా హ్యాట్స్ ఆఫ్ యూ అంటూ ట్వీట్ చేశాడు భజ్జీ. దీంతో దాదా ఉబ్బి పోయాడు. ఎనలేని సంతోషంతో భజ్జీ దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. అంటూ రీ ట్వీట్ చెప్పారు.
ఇదే సమయంలో గంగూలీ కీలకమైన కామెంట్స్ చేశాడు. భజ్జీ నీ అవసరం నాకుంది. నీవు లేక నేను లేనంటూ పేర్కొన్నాడు. దీంతో రాబోయే రోజుల్లో భజ్జీ బిసిసిఐకి ఏదో రకంగా సేవలు అందించే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు నాలుగేళ్లు కావొస్తుంది. భారత జట్టులో పోటీ పెరిగి పోవడంతో భజ్జీ కేవలం ఇంటికే పరిమితమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ఇవ్వని భజ్జీ..ఐపీఎల్‌లో పాల్గొంటూ క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు.
గతంలో భారత క్రికెట్ జట్టును తన దూకుడుతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన గంగూలీ.. అప్పట్లో హర్భజన్ లేకుండా మ్యాచ్‌కు సిద్ధమయ్యే వాడు కాదు. అసలు హర్భజన్ సక్సెస్‌కు గంగూలీనే ప్రధాన కారణమనేది కాదనలేని వాస్తవం. గంగూలీ తనపై ఉంచిన నమ్మకాన్ని కూడా హర్భజన్ నిలబెట్టుకుంటూనే వచ్చాడు. నువ్వొక నాయకుడివి. మిగతా వారు నాయకులు కావడానికి నాయకుడిగా నిలిచిన వాడివి. కంగ్రాట్స్ గంగూలీ అని హర్భజన్ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ఎంతైనా దాదా కదా.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి