తలైవా లుక్స్ అదుర్స్

లెక్కించలేనంత అభిమానులను సంపాదించుకుని, తలైవాగా పిలుచుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ సినిమా రిలీజ్ కాక ముందే భారతీయ సినిమా రంగాన్ని షేక్ చేసేస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ దర్బార్ సినిమాలో నటిస్తున్నాడు.ఇప్పటికే 90 సినిమా పూర్తయి పోయింది. జస్ట్ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశాడు మురుగదాస్. దీంతో యూట్యూబ్ లో లక్షలాది ఫ్యాన్స్ ట్రైలర్ ను చూశారు. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా కంటే ముందు రంజిత్ పా కాలా, కబాలి తీశాడు. ఇక రోబో, 2.0 సినిమాలు ఫ్యాన్స్ ఆశించినంతగా ఆడలేదు. అయినా తలైవా రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన చిటికేసినా, లేదా డైలాగ్ చెప్పినా చాలనుకునే వాళ్ళు కోకొల్లలు.

రజనీకాంత్ కు ఉన్న అభిమానం అలాంటిది. దర్బార్ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున డీలింగ్స్ జరిగాయి. శాటిలైట్ రైట్స్, సినిమా డిస్ట్రిబ్యూషన్ వన్నీ అయిపోయినట్టు సమాచారం. రజనీకాంత్ కు ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశ మంతటా అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా ఆయనకు మలేషియా, అమెరికా, సింగపూర్, చైనా, జపాన్ లలో లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన రేంజ్ ను దృష్టిలో పెట్టుకునే డైరెక్టర్లు కథలు రాస్తారు. సినిమాలు తీస్తారు. స్టార్ డం తో సంబంధం లేకుండా, జయాపజయాలను పరిగణలోకి తీసుకోకుండా తలైవా సినిమాలు చేసుకుంటూ వెళతారు. అంతే కాకుండా సినిమా అయిపోయాకా, తాను హిమాలయాలకు వెళ్లి పోతారు.

తన ఇష్ట దైవం మంత్రాలయం లోని రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారు. ఇదిలా ఉండగా దర్బార్ పోస్టర్ కు ఊహించని స్పందన వచ్చింది. సినిమా పరంగా చూస్తే తలైవా చాలా కాలం తర్వాత పోలీస్ గెటప్ లో కనిపించాడు. ఈ పోస్టర్ లో రజనీకాంత్ లుక్స్ లక్షలాది మందిని మెస్మరైజ్ చేస్తోంది. మురుగదాస్ మహేష్ బాబుతో చేసిన సినిమా స్పైడర్ తీశాడు. అది బోల్తా కొట్టింది. దీంతో అటు రజనీకాంత్ కు ఇటు మురుగదాస్ కు దర్బార్ సినిమా సక్సెస్ కావడం తప్పనిసరి. దీంతో ఈ పాన్ ఇండియా డైరెక్టర్ మరింత కసితో రజనితో దర్బార్ తీశాడు. సంక్రాంతి పండగకు సినిమా విడుదల చేయాలని మురుగదాస్ డిసైడ్ అయ్యాడు. అలెక్స్ పాండియన్ లాంటి పోలీస్ ఆఫీసర్ కథ అని చెప్పారు. త్వరలో దర్బార్ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!