దాదా మా బాబే అంటున్న దీదీ
ఇండియాకు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిష్టర్ కావడం చాలా ఈజీ, కానీ లక్షల కోట్ల డబ్బులు కలిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు ప్రెసిడెంట్ కావడం చాలా కష్టం. అలాంటి అరుదైన ఫీట్ ను అందుకోబోతున్నాడు మాజీ టీమిండియా సారథి, బెంగాలీ టైగర్, అంతా ముద్దుగా పిలుచుకునే దాదా ఉరఫ్ సౌరబ్ గంగూలీ. దేశంలో ఇప్పుడు మోడీ కంటే ఈ మాజీ క్రికెటర్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ దేశంలో అన్ని క్రీడా పోటీ సంస్థల్లో కంటే బిసిసిఐ సంస్థ బలమైనది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన, ఆదాయం కలిగిన క్రికెట్ బోర్డు గా పేరున్నది. దీంతో ఇందులో ఏ చిన్న పదవి దక్కినా చాలు కోట్లు వెనకేసుకోవచ్చు. అంతే కాదు జీవితాంతం సరిపడా సౌకర్యాలను పొందవచ్చు.
అందుకే ఈ పోస్టులకు అంతులేని డిమాండ్. ఇప్పటి దాకా రాజకీయాలు కొద్దిగానే ఉన్నప్పటికీ, లయన్ అమిత్ షా కన్ను దీనిపై పడింది. ఇంకేం ఊహించని రీతిలో చక్రం తిప్పాడు. తన కొడుకుకు కీలక పదవి కట్టబెట్టాడు. ప్రెసిడెంట్ పదవి కి నామినేషన్ వేసే కంటే ముందే గంగూలీ ..హోమ్ శాఖా మంత్రి షా తో భేటీ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా వీరిద్దరి కలయిక క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే దీనిని దాదా ఖండించాడు. దాదా ముక్కుసూటి ప్లేయర్. ఏదీ దాచుకోడు. ఇదే సమయంలో తాను ఏ పార్టీలో చేరనని దాదా వెల్లడించాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ ఎన్నిక ఏకగ్రీవం కావడంలో అమిత్ షా హస్తం ఉందనే చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో గంగూలీకి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాసటగా నిలిచారు.
సౌరవ్‌ను బెంగాల్ ముద్దు బిడ్డగా అభివర్ణించిన ఆమె..ఆయనతో ఫోన్‌లో తరచుగా మాట్లాడుతుంటానని తెలిపారు. మదర్ థెరిస్సా, అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీ నోబెల్ గెలుచుకుని బెంగాల్ ప్రజలు గర్వపడేలా చేశారన్నారు. ఇప్పుడు వారి సరసన గంగూలీ కూడా చేరారని దీదీ ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు దాదా మరో అడుగు ముందుకు వేసి తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంలో ఎవరి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. నామినేషన్ వేసే ముందు అమిత్ షాను కలిసిన విషయం వాస్తవమేనన్నారు. అయితే తమ మధ్య బీసీసీఐ అధ్యక్ష పదవి గురించిన ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు. మొత్తం మీద దాదా రాక బీసీసీఐలో కాకా పుట్టిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి