అర్దాకలిలో విద్యా వలంటీర్లు

ఆరేళ్ళు గడిచినా తెలంగాణాలో విద్యా వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈరోజు వరకు విద్యా శాఖలో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా నేటి దాకా ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. వారి స్థానంలో అతి తక్కువ వేతనాలకు విద్యా వాలంటీర్లను గతంలో నియమించింది. టెట్ తో పాటు బిఇడి, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని కఠినతరమైన నిబంధనలు విధించారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 15000 లకు పైగా ప్రొఫెషనల్ గా అన్ని అర్హతలు, అనుభవం కలిగిన వారు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ టీచర్స్ తో సమానంగా, అంత కంటే ఎక్కువగా విధులు నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే కాంట్రాక్టు పద్ధతిన నియమించిన విద్యా వాలంటీర్లను ఎప్పుడు పడితే అప్పడు తీసివేసేలా నిబంధనలు రూపొందించింది ప్రభుత్వం. ఎన్నికల సమయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో జాబ్స్ అంటూ ఉండబోవని చెప్పారు. తీరా కొలువు తీరాక దాని ఊసే ఎత్తడం లేదు. పొరుగున తాజాగా కొలువు తీరిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్...