కార్మికుల జీతాలకు డబ్బుల్లేవు
ఆర్టీసీ కార్మికులకు ఇప్పటికిప్పుడు చెల్లించేందుకు తమ వద్ద జీతాలు చెల్లించేందుకు తమ సంస్థ వద్ద డబ్బులు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన అడ్వొకేట్ జనరల్ హైకోర్టు ముందు నివేదించారు. దీనిపై ధర్మాసనం విస్తు పోయింది. నిన్నటి దాకా బస్సులు నడుపుతున్నామని, సమ్మె ప్రభావం ఏమాత్రం లేదని చెప్పిన సర్కార్ ఉన్నట్టుండి మాట మార్చడంపై సీరియస్ అయ్యింది. 50 శాతం బస్సులు నడుస్తున్నాయని చెబుతున్నారు. మరి ఆదాయం ఎక్కడికి వెళ్ళిందంటూ ఏజీని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు బదులు ఇవ్వలేదు. సరికదా సంస్థ వద్ద ఏడున్నర కోట్లు మాత్రమే ఉన్నాయని, మొత్తం కార్మికులకు వేతనాలు ఇవ్వాలంటే కనీసం 224 కోట్లు అవసరం అవుతాయని ఏజీ తెలిపారు.
దీంతో తీర్పును 29 కు వాయిదా వేసింది. అంతకు ముందు హైకోర్టులో ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై వాదనలు జరిగాయి. డిమాండ్ల సాధనకు పిలుపునిస్తూ ఆర్టీసీ కార్మికులు 5న సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించ లేదు. దీంతో వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే 48 వేల మంది ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల వేతనాలను ఇవ్వాలని కార్మికుల తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 28న ఆర్టీసీపై డివిజన్ బెంచ్‌లో విచారణ అనంతరం వేతనాల చెల్లింపు పిటిషన్‌పై విచారణ చేపడతామమని వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చింది. ఏజీ కోర్టుకు తమ వద్ద డబ్బులు లేవంటూ చెప్పడంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన డబ్బులు తప్పనిసరిగా ఇవ్వాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని అన్నారు. బస్సులు నడుపుతున్నామని సంస్థ చెబుతోంది, మరి వచ్చిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం దిగి వచ్చే దాకా సమ్మె కొనసాగుతుందన్నారు. ఆందోళన చేయడం తమకు అలవాటేనని అశ్వత్థామ రెడ్డి చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి