ఎక్జిట్ పోల్స్ లో కమల వికాసమే
ఓ వైపు ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న, ధరాభారం జనాన్ని కోలుకోలేకుండా చేస్తున్నా, బడాబాబులు బ్యాంకులను లూటీ చేస్తూనే ఉన్నా కేంద్రంలో నరేంద్ర మోదీజీ నేతృత్వంలోని బీజేపీ తన హవాను కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పటికే 80 శాతానికి పైగా పలు రాష్ట్రాలలో పవర్ లోకి వచ్చింది. మోడీ, అమిత్ షా దెబ్బకు విపక్షాలు విలవిలలాడి పోతున్నాయి. వీరిద్దరూ కొట్టిన దెబ్బకు అబ్బా అంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా హర్యానా, మహారాష్ట్రలలో ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. దీంతో ఇప్పటికే చేష్టలుడిగి పోయిన కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీలన్నీ దిక్కుతోచని స్థితిలోకి పడి పోయాయి.
ఈ రెండు రాష్ట్రాలలో పోలింగ్ అనంతరం పలు మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. గెలిచే సంఖ్యలో కొద్ది తేడాలున్నా గెలుపైతే కాషాయనిదేనని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి సునాయాసంగా డబుల్ సెంచరీ సాధిస్తుందని న్యూస్ 18– ఐపీఎస్‌ఓఎస్, ఏబీపీ– సీ ఓటరు పోల్స్ తేల్చాయి.
బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించడానికి 3 స్థానాల దూరంలో ఆగి పోయిందని న్యూస్ 18– ఐపీఎస్‌ఓఎస్ పేర్కొంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ సగటును పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ శివసేన కూటమికి 211, కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమికి 64 సీట్లు వస్తాయని తేలింది. హరియాణాలో బీజేపీ విజయం లాంఛనమేనని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 90 స్థానాల అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని పేర్కొన్నాయి. టైమ్స్ నౌ పోల్ బీజేపీ 71, కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 57, కాంగ్రెస్‌కు 17 స్థానాలు ఇచ్చింది.
న్యూస్ ఎక్స్ 77 సీట్లు బీజేపీవేనంది. టీవీ9 భారత్‌వర్‡్ష ఎగ్జిట్ పోల్ మాత్రం బీజేపీ మెజారిటీ కన్నా ఒక స్థానం ఎక్కువగా 47 సీట్లు గెలుస్తుందంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో, ఇతరులు 20 స్థానాల్లో గెలుస్తారని చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి 46.4 శాతం వస్తాయని ఐఏఎన్‌ఎస్– సీఓటర్ సర్వే పేర్కొంది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి 47.2 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి 38.3% ఓట్లు పొందగా, ఈ సారి 36.9% ఓట్లు వస్తాయని ఐఏఎన్‌ఎస్– సీఓటర్ సర్వే తెలిపింది. మొత్తం మీద చూస్తే మోడీ, అమిత్ షా ల హవాకు అడ్డుకట్ట వేసే నేతలు కరువయ్యారన్న మాట వాస్తవం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి