దిగొచ్చిన దిగ్గజ కంపెనీ


నిన్నటి దాకా జనానికి అంతా ఫ్రీ అంటూ బురిడీ కొట్టించి తన ఆదాయాన్ని అమాంతం పెంచుకుటూ పోయిన రిలయన్స్ గ్రూప్ కంపెనీ తాజాగా మొబైల్ వినియోగదారుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఎట్టకేలకు దిగి వచ్చింది. తాజాగా తన టారిఫ్ లను మార్చేసింది. జియో పేరుతో టెలికాం రంగం లోకి దిగిన కొన్ని రోజుల్లోనే మిగతా టెలికాం కంపెనీలకు చుక్కలు చూపించింది. ఇదే సమయంలో ట్రాయ్ నిబంధనల పేరుతో కస్టమర్స్ నెత్తిన అదనపు చార్జీలు వసూలుకు తెరలేపింది. దీంతో సదరు కంపెనీ దిగి రాక తప్పలేదు. రీఛార్జ్ చేసుకుంటే కొంత వెసలుబాటు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. జియో కొత్త గా మంత్లీ ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఉచిత ఐయూసీ కాల్స్‌ ఆఫర్‌తో  ‘జియో ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాన్స్‌ ను తీసుకొచ్చింది.

ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీ డేటాను అందిస్తోంది. ప్రధానంగా ఈ ప్లాన్లలో విశేషం ఏమిటంటే జియోయేతర మొబైల్‌ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌ టైమ్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతోపాటు ఎప్పటి లాగే  జియో టు జియో అన్‌ లిమిటెడ్‌  కాలింగ్‌ సదుపాయం కల్పిస్తోంది. సవరించిన రేట్లు ఇలా ఉన్నాయి. ఒక నెలకు ౨౨౨ రూపాయలు, 2 నెలలకు 333, 3 నెలలకు  444 లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. తమ కొత్త ప్లాన్స్‌ ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే మార్కెట్లో కనీసం 20-50 వరకు వరకు చౌకగా ఉన్నాయని జియో తెలిపింది. జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ను 111తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 3 నెలల 2జీబీ ప్యాక్  తో పోలిస్తే.. 444 మాత్రమే ఖర్చు అవుతుంది.

396  ప్లాన్స్‌లో మునుపటి ఖర్చుతో పోలిస్తే ఇపుడు 333  మాత్రమే ఖర్చవుతుందని, అలాగే అదనంగా 1,000 నిమిషాల ఐయూసీ వాయిస్ కాల్స్‌ ఉచితమని జియో తెలిపింది. విడిగా దీన్ని  కొనాలంటే 80 రూపాయలు వినియోగదారుడు వెచ్చించాల్సి వస్తుందని జియో వెల్లడించింది. కాగా ఇంటర్‌ కనెక్ట్ యూజర్‌ ఛార్జీ పేరుతో నిమిషానికి 6 పైసల వసూలును ఇటీవల జియో ప్రకటించింది. అలాగే ఒక రోజు వాలిడిటీ ఉన్న 19 ప్లాన్‌ను, 7  రోజుల వాలిడిటీ 52  ప్లాన్‌ను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా, అటు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్‌ స్పందిస్తూ తాము ఎలాంటి ఐయూసీ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ప్రజాగ్రహానికి జియో  తలవంచక తప్పలేదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!