అంతటా అవుట్ ఆఫ్ స్టాక్

 
చైనాకు చెందిన షావోమి కంపెనీ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో దిగ్గజ కంపెనీలకు కోలుకొని రీతిలో షాక్ ఇచ్చింది. ఇప్పటికే తక్కువ కాలంలో ఎక్కువ మొబైల్స్ ను అమ్మిన కంపెనీగా రికార్డ్ బ్రేక్ చేసింది. అతి తక్కువ ధరకు, అన్ని ఫీచర్స్ ఉండడంతో పాటు సామాన్యుల నుంచి బడా బాబుల దాకా, అందరికి నచ్చేరీతిలో స్మార్ట్ ఫోన్స్ ను డిజైన్ చేస్తోంది షావోమి. తాజాగా దీపావళి సందర్బంగా ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని షావోమి రెండు వేరియేషన్స్ లలో ‘రెడ్‌మి నోట్‌ 8, 8 ప్రో’ పేరుతో సరికొత్త మొబైల్స్ ను లాంచ్ చేసింది. ఎవరూ ఊహించని రీతిలో లక్షలాదిగా అమ్ముడు పోయాయి. ఆన్ లైన్ లో జస్ట్ నిమిషాల లోపే అమ్ముడు పోయాయి. దీంతో షావోమి కంపెనీ సైతం విస్తు పోయింది. ఇండియా షావోమి కంట్రీ హెడ్ కుమార్ జైన్ ను ప్రశంశలతో ముంచెత్తారు షావోమి చైర్మన్. ఇదిలా ఉండగా అమ్మకాలు ప్రారంభించిన వెంటనే హాట్‌కేకుల్లా సేల్‌ అయ్యాయి.
 
ఎంఐ వెబ్‌సైట్‌లో నోస్టాక్‌ అని కనిపించగా, వెయిట్‌ లిస్ట్‌ ఫుల్‌ అని అమెజాన్‌ వెట్‌సైట్‌ చూపించింది. మరోసారి కొనుగోలు చేసేందుకు ఈ ఫోన్లను ఎంఐ, అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టనున్నట్టు షావోమి తెలిపింది. ఇన్‌ బిల్ట్‌ అమెజాన్‌ అలెక్సాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్లు..గూగుల్‌ అసిస్టెన్స్, అలెక్సాతో పని చేస్తాయని కంపెనీ వివరించింది. ఒకేసారి రెండు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన తొలి మొబైల్స్‌ ఇవే కావడంతో వీటిని కొనేందుకు వినియోగదారులు అమితాసక్తి చూపారు. ప్రపంచంలోనే తొలిసారిగా 64 మెగాపిక్సెల్‌ కెమెరా సెన్సార్, హెలియో జీ90టీ చిప్‌సెట్‌తో విడుదలైన అధునాతన స్మార్ట్‌ఫోన్లు ఇవేనని సంస్థ ఇండియా హెడ్‌ మనుకుమార్‌ జైన్‌ అన్నారు. ఇక రెడ్‌మి నోట్‌ 8 ఫీచర్లు ఇలా ఉన్నాయి.
 
6.39 అంగుళాల డిస్‌ప్లే , 1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 9 ,క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌, 665 సాక్‌, 4 జీబీ ర్యామ్‌ , 64 జీబీ స్టోరేజ్‌, 48+ 8 + 2 +2 ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీబీ/64 జీబీ ధర 9,999 రూపాయలు ఉంది. మరో వైపు ,రెడ్‌మినో ట్ 8 ప్రో ఫీచర్లు, 6.53 అంగుళాల డిస్‌ప్లే, 1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, మీడియా టెక్‌ హీలియో ప్రాసెసర్‌ జీ90టీ, ఆండ్రాయిడ్‌ 9 , 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 4+8+2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6జీబీ/64జీబీ ధర 14999 రూపాయలు గా ఉంది. మొత్తం మీద షావోమి అమ్మకాలతో మిగతా కంపెనీలు పునరాలోచనలో పడింది.
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!