అందరి చూపు కన్నయ్య వైపు

మేధావిగా..అద్భుతమైన స్పీకర్‌గా ..జెఎన్‌యు లీడర్‌గా పేరు తెచ్చుకున్న కన్నయ్య కుమార్ ఇపుడు ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. విలువైన ఓటును అమ్ముకోవద్దని..నిజాయితీకి పట్టం కట్టండని ఆయన కోరుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వయసులో చిన్నోడైనా చదువులో గట్టోడు. జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్‌కు ఇంతకు ముందు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కు నాయకుడిగా ఉన్నారు. ఈ విద్యార్థి సంస్థ సీపీఐకి అనుబంధంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి లో డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు కన్నయ్య కుమార్. బీహార్ ..బెగసూరై జిల్లా బిహాత్ గ్రామంలో జనవరి 1987లో జన్మించారు. తెగ్రా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది కన్నయ్య స్వంతూరు. కన్నయ్య తల్లి మీనాదేవి అంగన్‌వాడి టీచర్‌గా పనిచేస్తోంది. అన్న మనికాంత్ అస్సాంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. కన్నయ్య కుటుంబీకులంతా సిపిఐ పార్టీకి సపోర్టర్స్‌గా ఉన్నారు. ఆఫ్రీకన్ స్టడీస్ పై జెఎన్‌యులో పీహెచ్‌డి చేశారు. కాలేజీ ఆఫ్ కామర్స్ లో చదువుతుండగానే పాలిటిక్స్‌లో చురు...