డాల‌ర్ల పంట పండిస్తున్న మొబైల్ యాడ్స్

ఒక‌ప్పుడు ప్రింట్..మీడియా..కానీ ఇపుడు ప‌రిస్థితిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. యాడ్స్ కోసం నానా తంటే ప‌డాల్సిన ప‌నిలేదు. న్యూ లుకింగ్..కొత్త ర‌క‌మైన సాంకేతిక తోడ‌వ్వ‌డంతో ప్ర‌క‌ట‌న‌ల రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఎక్కువ రిస్క్ వుండేది. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి త‌ప్పింది. అన్ని రంగాల‌కు చెందిన కంపెనీల‌న్నీ మొబైల్స్ ను టార్గెట్ చేసుకుంటున్నాయి. శోధిస్తే స్మార్ట్ ఫోన్ల‌దే హ‌వా కొన‌సాగుతోంది. ఏది అమ్మాల‌న్నా కొనాల‌న్నా ఈ కామ‌ర్స్‌లోనే. దీంతో డిజిట‌ల్ మార్కెటింగ్..అడ్వ‌ర్ టైజ్ మెంట్ ..ఎంట‌ర్ టైన్ మెంట్ క‌లిసి పోతున్నాయి. ఇదంతా ఇంట‌ర్నెట్ మాయాజాలం.

వీటి వ్యాపారం బిలియ‌న్లు..ట్రిలియ‌న్ల‌ను దాటింది. రిస్క్ లేని వ్యాపారం. త‌క్కువ పెట్టుబ‌డి..ఎక్కువ‌గా రాబ‌డి వ‌చ్చే రంగం ఏదైనా వుందంటే అది ఇదే. ఇంకేం అన్ని కంపెనీలు..క్లౌడ్ కంప్యూటింగ్ , ఆటోమేష‌న్ , మెషిన్ ల‌ర్నింగ్, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సీ ఆధారంగా టెక్నాల‌జీ రోజు రోజుకు అప్ డేట్ అవుతోంది. ఈ మేర‌కు దీని పైనే ఔత్సాహికులు, ఎక్స్ ప‌ర్ట్స్‌, సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు ప్ర‌తిరోజు కుస్తీలు ప‌డుతున్నారు. త‌మ మెద‌ళ్ల‌కు ప‌దును పెడుతున్నారు.

ఇండియాలో 25 శాతానికి పైగా యూత్ స్మార్ట్ ఫోన్ల‌కు అడిక్ట్ అయ్యారు. వీరంతా రోజుల త‌ర‌బ‌డి..గంట‌ల కొద్దీ ..త‌మ జీవితాల‌ను పారేసుకుంటున్నారు. త‌మ క‌ల‌ల‌కు ప్రాణం పోస్తున్నారు. వాటిని స్టార్ట‌ప్స్ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కంపెనీ ప్రారంభం నుండి ఎండ్ అయ్యే దాకా ..ప్ర‌తిది ఇందులో పార్ట్ గా వుండిపోతుంది. జింగిల్స్ ద‌గ్గ‌రి నుండి 2 లేదా 3 నిమిషాల నిడివి క‌లిగిన యాడ్స్ చేయ‌డం క‌త్తి మీద సాము లాంటిదే. ఇలాంటి వాటిలో మ‌న సినీ డైరెక్ట‌ర్లు ఎన్నో యాడ్స్‌కు ప్రాణం పోస్తున్నారు. వారిలో డైలాగ్ మేక‌ర్ ..త్రివిక్రం మొద‌టి స్థానంలో ఉన్నారు. మీకంద‌రికి గుర్తుండే వుంటుంది..ఐడియా కంపెనీ యాడ్.


కోట్లాది మందిని త‌మ వైపున‌కు తిప్పుకునేలా చేసింది. ఒక్క ఐడియా చాలు..గెలుపు..
సాధించ‌డానికి..వ్యాపారమైనా..వ్య‌వ‌హారమైనా..చివ‌రికి లైఫ్ అయినా.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా కోట్లాది యాడ్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కొన్ని మాత్ర‌మే గుండెల్లో పది కాలాల పాటు గుర్తుంచుకునేలా చేశాయి. అమెరికా, సింగ‌పూర్, చైనా, ఇండియా..ప్ర‌తి కంట్రీ స్మార్ట్ ఫోన్ల‌లోనే కంపెనీలు అత్య‌ధికంగా డిజిట‌ల్ యాడ్స్ ఇచ్చేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ప‌త్రిక‌లు, సినిమాలు, టీవీ ఛాన‌ల్స్ లో కంటే స్మార్ట్ ఫోన్ల‌లోనే ఎక్కువ‌గా యాడ్స్ వ‌స్తున్నాయి. 2022 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెరుగుతుంద‌ని రెడ్ సీర్స్ స‌ర్వే లో పేర్కొంది. ఇప్ప‌టి దాకా పేప‌ర్లు, టీవీల‌కు త‌క్కువ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూనే మొబైల్స్‌ను టార్గెట్ చేశాయి కంపెనీలు.

యూట్యూబ్‌లో , ఐపీఎల్ మ్యాచ్‌లు, కొత్త సినిమాలు, ట్రైల‌ర్స్‌,రిలీజ్ ..ఇలా ప్ర‌తి ప్రొడ‌క్ట్, ఈ కామ‌ర్స్ కంపెనీల‌న్నీ డిజిట‌ల్ యాడ్స్ వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో మొబైల్ ఉంటోంది. సో ఓపెన్ చేస్తే చాలు యాడ్స్ వ‌స్తూనే వుంటాయి. లైవ్ స్పోర్ట్స్ , న్యూస్ ఛాన‌ళ్ల దాకా అన్నీ డిజిట‌ల్ బాట ప‌ట్టాయి. ప్ర‌క‌ట‌న‌ల రంగం రూపు రేఖ‌లు పూర్తిగా మారి పోయాయి. ఒక్క అమెరికాలోనే మొబైల్స్ ద్వారా 113.21 బిలియ‌న్ల డాల‌ర్ల యాడ్స్ ద్వారా ఆదాయం స‌మ‌కూరింది. ఇది కూడా ఓ రికార్డ్‌గా భావించాలి. సో..టీవీకి 69.52 బిలియ‌న్ డాల‌ర్లు, రేడియో ద్వారా వ‌చ్చిన యాడ్స్ 14.46 , ప్రింట్ 12.92 ప్రింట్..త‌దిత‌ర ప్ర‌క‌ట‌న‌ల ద్వారా వ‌చ్చిన ఆదాయం ఇది. వీటిని బ‌ట్టి చూస్తే యాడ్స్ త‌గ్గాయి.మొబైల్స్ ద్వారా ఎక్కువ వెళ్లాయి.

కామెంట్‌లు