బ్యాంకులతో ఒప్పందం..ప్రయాణం సులభం
జర్నీ చేయాలంటే..నానా తిప్పలు పడే వాళ్లు జనం. దానిని గమనించి..ఇక్కట్ల నుంచి బయట పడేందుకు చేసిన ఆలోచనే..బుక్ చేస్తే చాలు మన దగ్గరకు క్షణాల్లో వాలిపోయే వాహనాలు వుంటే ఎలా ఉంటుందో అదే ఇది. ఇక డబ్బులు లేవని చింతించాల్సిన పనిలేదు. ఏకంగా క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించాయి ఓలా , ఫ్లిప్ కార్డ్ కంపెనీలు. ఇందు కోసం బడా బ్యాంకులు ఒప్పందాలు చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. క్యాడ్ ఎగ్రిగేటర్ స్టార్టప్ ఓలా ఎస్ బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వారం రోజుల్లోనే ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఊబర్ కంటే ఓలా సంస్థకు కోటిన్నర మంది కస్టమర్లు ఉన్నారు. దీంతో వీరిలో మొదటి ఏడాది 10 లక్షల కార్డులు జారీ చేయాలని సంస్థ నిర్ణయించింది.
ఈ ఒప్పందం కుదిరితే రిస్క్ ఎనాలసిస్, కార్డుల జారీ, పేమెంట్ ప్రాసెసింగ్, క్రెడిట్ లైన్ మేనేజ్‌మెంట్, స్టేట్‌మెంట్ ప్రాసెసింగ్ వంటి పనులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. మరో వైపు మార్కెటింగ్, ప్రమోషన్స్, డిస్కౌంట్స్ వంటి బాధ్యతలను ఓలా చూసుకుంటుంది. క్రెడిట్ కార్డ్స్ జారీ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంస్థ చెబుతోంది. సాధారణ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే వాటి కంటే తాము ఎక్కువ రివార్డ్ పాయింట్స్ ఇస్తామంటోంది. కోటిన్నర తోపాటు మరో కోటి మందిని ఆకర్షించేందుకు ఇది దోహద పడుతుందని సంస్థ భావిస్తోంది. కార్డులు ఇవ్వడం వల్ల మరింత ఆకర్షితులవుతారని అంచనా వేస్తోంది.
మార్కెట్‌లో ఇతర సంస్థలతో పోటీ పడాలి. వాటికి ఎత్తుకు పై ఎత్తులు వేయాలి. ఆదాయాన్ని సమకూర్చు కోవాలి. మరింత విస్తరించాలి. ఇది ఓలా వ్యూహం. ప్రతి కంపెనీ ఇపుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. క్యాబ్స్ సేవలతో పాటు పలు రకాల సేవలను కస్టమర్లకు అందించాలన్న ఆలోచనలో భాగమే ఈ కార్డుల జారీ అంటోంది. 2015లోనే ఓలా డిజిటల్ పేమెంట్స్ వ్యాపారంలోకి ఎంటరైంది. ఓలా మనీ ద్వారా బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీఛార్జెస్, మనీ ట్రాన్స్ ఫర్ వంటి సేవలు అందిస్తోంది. అనంతరం వ్యాపారం పుంజు కోవడంతో తక్కువ కాలంలో రుణాలు ఇచ్చేందుకు ఓలా పోస్ట్ పేడ్‌ను స్టార్ట్ చేసింది. కస్టమర్‌ను బాగా అర్థం చేసుకునేందుకు ఇంటర్నెట్ కంపెనీలకు క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగ పడతాయి.
ఆన్ లైన్‌లో, ఆఫ్ లైన్‌లో ఎంత ఖర్చు చేస్తున్నారనేది తెలుస్తుంది. పేరు ఎంటర్ చేస్తే చాలు..వినియోగదారుల వివరాలన్నీ క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. దీంతో రుణం ఇవ్వాలా లేదా అన్నది స్పష్టమవుతుంది. కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ద్వారా రిటైలర్, సర్వీస్ ప్రొవైడర్స్‌తో షాపింగ్ చేస్తే ప్రత్యేక డిస్కౌంట్స్ , ఎక్కువ రివార్డు పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్స్ వల్ల భవిష్యత్‌లో చేసే షాపింగ్‌కు డిస్కౌంట్లు వస్తాయి. ఇదే సిస్టంను రైల్వే శాఖ అమలు చేస్తోంది. ఇప్పటికే ఎస్‌బిఐతో రైల్వే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్డు కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్లు, రివార్డు పాయింట్స్ వస్తాయి. మరింత కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ఇలాంటి కార్డులు అందజేస్తాయి. కస్టమర్ల సమాచారం బ్యాంకుల వద్ద ఉంటుంది ..కాబట్టి దీని సాయంతో చాలా మందికి కార్డులు, లోన్లు ఇవ్వడం ఈజీ అవుతుంది.
బ్రాండ్ విలువ, కస్టమర్ల సంఖ్య బాగుంటేనే బ్యాంకులు కో బ్రాండెడ్ కార్డులు జారీ చేసేందుకు అంగీకరిస్తాయి. లేదంటే నో చెప్పేస్తాయి. ఇందులోను రిస్క్ ఎక్కువగా ఉంటుంది. డేటా ఇక్కడ ముఖ్యం. ఓలాకు ఉన్న కోటిన్నర మంది..ఫ్లిప్ కార్డులో నమోదు చేసుకున్న సభ్యులు కలిస్తే భారీగా కస్టమర్లు రిజిస్టర్ అవుతారు. దీంతో ఆదాయం సమకూరుతుంది. వ్యాపారం పెరుగుతుంది. దీంతో పాటు బ్యాంకుకు లాభం చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటే క్రెడిట్ హిస్టరీ లేకున్నా కార్డులు ఇవ్వాలని భావిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు ప్లిఫ్ కార్డ్ డేటా పాయింట్ల లెక్కింపు పద్ధతిని పాటిస్తోంది. త్వరలో స్వంతంగా తమ కంపెనీ పేరుతో క్రెడిట్ కార్డ్స్ జారీ చేస్తామని, ఇందుకోసం హెచ్‌డి ఎఫ్‌సీ లేదా ఆక్సిస్ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చు కోవాలని చూస్తోంది ఫ్లిప్ కార్డు సంస్థ.
గత సంవత్సరంలో అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్స్ విడుదల చేసింది. ఈ కార్డుల ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేసిన వారికి అధిక రివార్డులు, డిస్కౌంట్లు ఇస్తున్నారు. క్రెడిట్ కార్డు పార్ట్‌నర్ షిప్‌ల వల్ల బ్యాంకులకు అతి తక్కువ ఖర్చుతో లక్షల మంది కస్టమర్ల వివరాలు బ్యాంకులకు తెలుస్తాయి. మొత్తం మీద కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్స్ కు రాబోయే కాలంలో భారీ డిమాండ్ ఉండబోతోంది. ఏయే కంపెనీలు దేనితో ఒప్పందం కుదుర్చుకుంటాయో తెలియదు. ఈ కామర్స్ దిగ్గజ కంపెనీలన్నీ వీటిపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. కంపెనీలకు ఆదాయం..కస్టమర్లకు సంతృప్తి దక్కడం ఖాయం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి