సింధూరం ఆభరణం..గుర్తింపునకు దర్పణం
ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. కాని ఇండియాలోనే ఉన్నది. విశిష్టమైన చరిత్ర. ఘనమైన వారసత్వపు సంపద..అపారమైన వనరులు ..లెక్కలేనంత సంపద..లెక్కించలేనంత ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఊరిలో మనుషులు లేక పోయినా సరే గుడి మాత్రం తప్పక ఉండి తీరుతుంది. ఎక్కడికి వెళ్లినా సింధూరం పెట్టుకుని వెళ్లడం అలవాటు. ఇదో సాంప్రదాయానికి గుర్తింపుగా మారి పోయింది. ప్రతి చోటా కుంకుమ అనివార్యంగా మారింది. గ్లోబెల్ గురువుగా వినుతికెక్కిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామిజి సింధూరాన్ని ధరించే పద్ధతి అద్భుతంగా ఉంటుంది. ఇదో స్టయిల్. అందరూ ఆయనను అనుసరిస్తారు. ఆరాధిస్తారు. ప్రేమిస్తారు కూడా. ఇదే భక్తిలో ఉన్న మహత్తు. వేలాది మంది భక్తులు ఎక్కడినుండో వస్తారు. ప్రతి ఒక్కరికి స్వామి వారు ఏదో ఒకటి ఇస్తారు.
ఎంత ఇవ్వగలిగితే అంత మంచిది అంటారు. ఇవ్వడం మన జాతి లక్షణంగా పేర్కొంటారు. దశ..దిశలను మార్చేసే సత్తా ఆయనకు మాత్రమే ఉన్నది. అందుకే ఆయన గురువయ్యారు. మనం మనుషులుగా ఉండి పోయాం. నడిచే పద్ధతి..మాట్లాడే పద్ధతి..సింధూరం ధరించే విధానం అన్నీ ప్రత్యేకతలే. ఏ దానిని ఇంకొక దానితో పోల్చలేం. ఎప్పుడూ నిండుగా సింధూరం ధరించే వారిలో చాలా మంది ఉన్నారు. రాజకీయ పరంగా చూస్తే టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఒకరు. దేశ వ్యాప్తంగా చర్చలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. చక్కని హిందీలో ప్రసంగించడం ..సబ్జెక్టును పూర్తిగా తెలుసుకుని మాట్లాడటం ఆయనకు మాత్రమే చెల్లింది. ఎలాంటి లూజ్ కామెంట్స్ చేయకుండా ..సింపుల్‌గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు ఈ సిట్టింగ్ ఎంపీ.
ఆయన ధరించే సింధూరమే కొత్తగా జనాన్ని ఆకర్షిస్తోంది. ఎందుకని అడితే ఇది మానాయిన నాకిచ్చిన వారసత్వం అంటారు ఓ సందర్భంలో. సామాజికంగానే కాదు మానసికంగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించేది ఏదైనా ఉందంటే ..అది సింధూరం ఒక్కటే. కొందరు చిన్నగా ధరిస్తారు. ఇంకొందరు పెద్దగా పెట్టుకుంటారు. కానీ మా తండ్రి గారి వారసత్వంగా నాకు ఇది సంక్రమించింది. దానితోనే నేను ప్రయాణం చేస్తున్నా. అదే నాకు ప్రజల నుండి ఎనలేని అభిమానాన్ని అందించేలా చేస్తోంది అంటారు రామ్మోహన్ నాయుడు. హిందీలో మాట్లాడాలంటే చాలా మంది భయపడతారు. కానీ ఆయన మాత్రం తాపీగా..కూల్‌గా ..సబ్జెక్టు వైజ్‌గా మాట్లాడతారు. చేతిలో ఫైల్ ఉండాల్సిందే. లేకపోతే ఆయన బయటకు రారు. అంతలా ఇష్యూస్‌ను స్టడీ చేస్తారు. మిగతా సభ్యులతో కలివిడిగా ఉంటారు.
సభ బయట ఎంతో హుందాగా ఉండే ఈ యువ ఎంపీ ..సమావేశాల్లోకి ఎంటర్ అయితే చాలు..ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు. తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఆయన నిలదీస్తారు. ఈ ఎంపీ మాట్లాడేటప్పుడు ఎలాంటి అరుపులు, కేకలు వినబడవు. ఎందుకంటే ఇందులో ఏదో తెలుసుకోదగిన అంశం ఉంటుంది కనుక. ప్రతిదీ నోట్స్ రాసుకోవడం, ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవడం..అంకెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. లేవనెత్తే అంశం దేశానికి సంబంధించింది అయి ఉండటమే కాదు ప్రజలకు ప్రయోజనకారిగా ఉందా లేదా అని సమీక్షిస్తారు. ఆ తర్వాతే ప్రశ్నోత్తరాల సమయంలో నిలదీసినంత పనిచేస్తారు. ఏది ఏమైనా ఈ యువ ఎంపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుస్తారో లేదా వేచి చూడాల్సిందే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి