ప్లీజ్ ఎఫ్‌డీఐకి పర్మిషనివ్వండి

ఇండియన్ టెలికాం కంపెనీల్లో టాప్ కంపెనీగా ఉన్న భారతీ ఎయిర్ టెల్ కంపెనీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఉన్నట్టుండి రిలయన్స్ జియో కొట్టిన దెబ్బకు వృద్ధి రేటులో వెనుకబడి పోయింది. దీంతో ఉద్దీపన చర్యలు చేపట్టింది. భారతీ ఎయిర్‌టెల్ ప్రమోటర్‌గా ఉన్న భారతీ టెలికాం 4,900 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ఇండియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ సొమ్ము సింగపూర్‌కు చెందిన సింగ్‌టెల్, ఇతర విదేశీ కంపెనీల నుంచి రానుంది. ఒకవేళ అనుమతి లభించి పెట్టుబడులు పొందితే ఈ టెలికాం కంపెనీ విదేశీ కంపెనీగా మారనుంది. ఎఫ్‌డీఐ ద్వారా నిధులు వస్తే భారతీ టెలికాంలో విదేశీ షేర్ హోల్డింగ్ 50 శాతం దాటు తుందని, అప్పుడు విదేశీ కంపెనీగా మారడానికి అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. 4,900 కోట్ల నిధుల రాక కోసం భారతీ టెలికాం దరఖాస్తు చేసుకుంది. ఇందులో సింగ్‌టెల్‌తో పాటు ఇతర విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి కూడా ఉంది. ఈ పెట్టుబడులతో విదేశీ ఇన్వెస్టర్ల వాటా పెరిగి భారతీ టెలికాం విదేశీ కంపెనీగా మారుతుంది. ఈ నెలలోనే టెలికాం విభాగం ఈ పెట్టుబడికి అనుమతిచ్చే అవకాశం ఉంది అన...