ఈ పాపం పంతుళ్లు..పేరెంట్స్ దే
అవును..ఇది ముమ్మాటికీ వాస్తవం కూడా. వినేందుకు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ బుద్దులు నేర్పాల్సిన పంతుళ్లు..ప్రాణం పోయడమే కాదు నీతిమంతంగా, ధర్మ బద్దంగా ఎలా బతకాలో, విలువలను ఎలా కాపాడు కోవాలో నేర్పించాల్సింది మాత్రం కన్నవారిదే. దీనిని కాదనలేం. పొద్దస్తమానం వస్తువుల వ్యామోహంలో పడి, ఫక్తు ఉన్న ఒక్క జిందగీని నాశనం చేస్తున్న ఈ పాపం మాత్రం వీళ్లదే. ఇది కాదనలేని సత్యం. ప్రపంచం తన దారిన తాను వెళ్లి పోతోంది. అలాగని కాలంతో పోటీ పడగలమా. ఎన్నో ఆవిష్కారణలు, మరెన్నో సాంకేతిక మార్పులు చోటు చేసుకున్నాయి. అయినా బతుకు జెర్నీలో నిత్యం ఆటుపోట్లు, అష్టకష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. నేర్చు కోవడానికి, మనల్ని మనం సంస్కరించు కోవడానికి లెక్కలేనన్ని దారులు, మార్గాలు ఉన్నాయి. వీటిని వెతికి పట్టుకుని ప్రాక్టీస్ చేయడమే మిగిలి ఉన్నది. ఏదీ ఊరికే, సులభంగా రాదు. జిందగీ అంటేనే మనతో మనం యుద్ధం చేయడమే కాదు ఇతరులతో పోటీ పడటం కూడా.
మనం ఈ లోకంలో ఉన్నామంటే అదృష్టం అనుకోవాలి. అంటే అర్థం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్న మాట. ఒకప్పుడు కలిసి మాట్లాడుకునే వీలుండేది. ఇప్పుడు కలవాలంటే దానికో ప్రత్యేక సమయం కావాల్సి వస్తోంది. చుట్టూ మనుషుల సమూహం పెరుగుతూ పోతోంది ఆక్టోపస్ లాగా. నరుక్కుంటూ పోతే చెట్లు..చంపుకుంటూ పోతే మనుషులు మిగలరు. ఇదేనా మనం కోరుకున్న సమాజం. ఒకరి కళ్ళలోకి ఒకళ్ళం సూటిగా, నేరుగా చూడలేని దుస్థితి ఎందుకు దాపురించింది. నేరాలు ఎందుకు పెరిగి పోతున్నాయి. దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి. ఈ సీసీ కెమెరాలు, ఏ పోలీసులు వీళ్ళను ఆపగలరు. అన్ని సమస్యలకు చంపడమే పరిష్కారమా. ఇలాగైతే మనకు ఆటవిక రాజ్యానికి తేడా ఏమిటి. ఇక ఈ రాజ్యాంగం ఉన్నది, ఏర్పాటు చేసుకున్నది ఎందుకు..?
అన్ని జీవరాశుల్లో మానవ జన్మ ఉత్క్రుష్టమైంది. ఎంతో ఉన్నతమైనది. దీనిని ఎవరూ కాదనలేం. కానీ బుద్దులు నేర్పాల్సింది ఎవరు. మతి తప్పి ప్రవర్తిస్తూ భారంగా తయారవుతున్న నయా జమానాను అదుపులో ఉంచాల్సింది తల్లిదండ్రులు కాదా. అందుకే ఈ నేరం నీది నాది కాదు. సమాజానిది..దానిలో భాగమైన పంతుళ్లు, పేరెంట్స్ దే. బిడ్డలకు మొదటి గురువులు కన్నవాళ్ళు. వీళ్ళు ప్రాణం పోస్తే..ప్రపంచాన్ని పరిచయం చేసి, మనుషులుగా తీర్చి దిద్దేది గురువులే. భగవత్ గీత, ఖురాన్, బైబిల్ బోధిస్తున్నది ఇదే. ఎన్ని ఇతిహాసాలు ఉన్నా, ఎన్ని ధర్మోపదేశాలు చేసినా మారాల్సింది మనమే. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లోకంలో ప్రతి వస్తువుకు విలువుంది. దానికి ఓ పరమార్థం కూడా దాగి ఉంది. ప్రతి దాంట్లో మంచి, చెడూ కలిసి ఉంటాయి. కావలసిందల్లా మనకు ఏది కావాలో తెలుసు కోవడం. అందుకు అనుగుణంగా మనల్ని మనం తీర్చి దిద్దు కోవడం.
ప్రకృతి ఎంతో విలువైనది. అత్యంత బలీయమైనది. అంతకంటే శక్తి వంత మైనది కూడా. కాలాన్ని గుర్తించండి. గురువులు, పేరెంట్స్ మారండి. పిల్లలల కోసం మీ సమయాన్ని కేటాయించండి. వాళ్లకు బాంధవ్యాల, బంధాల గురించి చెప్పండి. వినే దాకా ప్రయత్నం చేయండి. వస్తువులు అవసరమే. అలాగని వాటి వెంట మీరు పరుగెత్తడం మొదలు పెడితే మీరు జీవితాన్ని కోల్పోతారు. అసంతృపితో రగిలి పోతారు. ఒకటి కొంటే మరొకటి ఊరిస్తుంది. డాలర్ల జపం మానేయండి. ధర్మ బద్దంగా ఎలా ఉండాలో నేర్చుకోండి. పొద్దస్తమానం మొబైల్స్ తో సహవాసం మిమ్మల్ని మీకు కాకుండా చేస్తుంది. రేపొద్దున మీరు ప్రాణప్రదంగా ప్రేమించిన మీ బిడ్డలు మీ ముందు దోషులుగా నిలబడతారు. మీరే నేరస్థులుగా ఉండి పోతారు. విలువలే ప్రామాణికం కావాలి. మానవత్వమే అంతిమ ఎజెండా కావాలి. సమాజంలో భాగమైన మానవ సమూహం ఈ దిశగా ప్రయాణం చేయాలి. పంతుళ్లు..పేరెంట్స్ జర భద్రం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి