కలిసిన కంటెస్టెంట్స్

ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే కాలం మన చేతుల్లేదు కనుక. నిన్నటి దాకా సామాన్యులుగా ఉన్న వాళ్ళు ఒక్క రోజులోనే పాపులర్ అవుతున్నారు. వైరల్ గా మారిపోతున్నారు. యూట్యూబ్ స్టార్స్ గా వెలిగి పోతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ టాలెంట్ ఉంటే చాలు బతికేస్తున్నారు. ట్రెండ్ సృష్టిస్తూ దుమ్ము రేపుతున్నారు. సింగర్ గా ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ఒకే ఒక్క బిగ్ బాస్ రియాల్టీ షోతో ఇండియన్ స్టార్ అయి పోయాడు. అలాగే ఈ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న ప్రముఖ యాంకర్ శ్రీ ముఖి, రాహుల్ లు ఒక్కటయ్యారు. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను శ్రీ ముఖి పోస్ట్ చేశారు.

నిమిషాల్లో ఇది ట్రోల్ అయ్యింది. గతం గతః.. అసలు రిలేషన్‌షిప్‌ ఇప్పుడే మొదలైంది అంటూ క్యాప్షన్‌తో పాటుగా హార్ట్‌ సింబల్‌ను జత చేశారు. అంతే కాదు రాహుల్‌ సైతం శ్రీముఖి షేర్‌ చేసిన ఫొటోను రీపోస్ట్‌ చేయడం విశేషం. ఈ క్రమంలో శ్రీముఖి, రాహుల్‌ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. మీరిద్దరు ఇలా కలిసి పోవడం బాగుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా, పున్ను సంగతి ఏంటి రాహుల్‌ అంటూ మరికొందరు తమదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తున్నారు.

కాగా బిగ్‌బాస్‌లో మొదటి నుంచి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీముఖి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫేక్‌ ఎలిమినేషన్‌కు గురై, చివరి సమయంలో పుంజుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌ టైటిల్‌ను దక్కించుకుని సత్తా చాటాడు. రాహుల్‌ కన్నా అన్ని విషయాల్లో తనే బెటర్‌ అనుకున్న శ్రీముఖి రన్నరప్‌కే పరిమిత మవడాన్ని ఆమెతో సహా అభిమానులు జీర్ణించు కోలేక పోయారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ షో ముగింపు సందర్భంగా ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. హోస్ట్‌ నాగార్జున రాహుల్‌ను విజేతగా ప్రకటించగానే ముందుగా శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు.

ఓటమిని ఎవరూ ఇష్టపడరు. ముఖ్యంగా నేను  అంటూ తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. షో అనంతరం ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌ వెళ్లిన శ్రీముఖి.. తన దృష్టిలో బాబా భాస్కరే నిజమైన విజేత అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాహుల్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేయడంతో నెటిజన్లు తికమక పడుతున్నారు. శ్రీముఖి మనసులో ఏముందో తెలుసుకోలేక టెన్షన్ కు లోనవుతున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!