సరిహద్దులు దాటిన స్నేహం
నిన్నటి దాకా ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య స్నేహం ప్రమాదంలో పడింది. కాశ్మీర్ విషయంలో భారత్ పై, దేశ ప్రధాని మోదీజీపై నానా రకాలుగా కామెంట్స్ చేసిన పాకిస్తాన్ తన ధోరణిని మార్చు కోవడం లేదు. అంతర్జాతీయంగా ఇండియాను ఏకాకిగా చేయాలనుకున్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు తానే ఏకాకి అయ్యారు. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అగ్ర దేశాలు నచ్చ చెప్పినా పాక్ వినలేదు. ఓ వైపు సరిహద్దుల వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా, మాజీ క్రికెటర్, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దుకు మాత్రం ఆ దేశంలో ఊహించని రీతిలో స్వాగతం లభిస్తోంది. ఈ విషయంలో మాత్రం క్రీడాభిమానులు విస్తు పోతున్నారు. ఇమ్రాన్ కు సిద్ధూ అంటే వల్లమాలిన అభిమానం. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకించి ఇన్విటేషన్ కూడా పంపించారు.
ద్వేషం అన్నది పొలిటికల్ లీడర్ల మధ్యే ఉంటుందని, అది ఆటల్లో ఉండదని మరోసారి నిరూపించారు ఇండియన్స్. భారత అథ్లెటిక్స్ సమాఖ్యపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురి పిస్తున్నారు. ఇంతకీ ఏఎఫ్‌ఐపై ఇంతగా ప్రశంలసల వర్షం కురవడానికి బలమైన కారణమే ఉంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ స్వర్ణం గెలిచాడు. నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దీనిపై ఏఎఫ్‌ఐ తమ అధికారిక ట్విటర్‌లో స్పందించింది. అర్షద్ నదీమ్‌కు కంగ్రాట్స్. దశాబ్దాల తర్వాత నేరుగా ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి పాకిస్తాన్ అథ్లెట్‌గా అర్షద్ రికార్డు నెలకొల్పాడు అంటూ ట్వీట్ చేసింది. అంతే కాకుండా భారత జావెలిన్ స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రాతో అర్షద్ కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది.
ప్రస్తుతం భారత అథ్లెటిక్స్ సమాఖ్య చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని కేవలం ఆటలు మాత్రమే తొలగించగలవు అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. రెండు దేశాల మధ్య సయోధ్య, సత్సంబంధాలు తిరిగి పునరుద్దరించు కోవాలంటే కేవలం క్రీడలు మాత్రమే ఉపయోగపడతాయి అంటూ మరికొంత మంది ట్వీట్ చేశారు. ముంబై దాడుల అనంతరం భారత్, పాక్ దేశాల మధ్య తిరిగి శత్రుత్వం తారా స్థాయికి చేరగా.. పుల్వామా టెర్రర్ అటాక్ అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగి పోయిన విషయం తెలిసిందే. ఈ రూపకంగానైనా శత్రుత్వాన్ని మరిచి అభినందించడం క్రీడాస్ఫూర్తి కి నిదర్శనం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి