చదువు కోసం ఏపీ సర్కార్ చేయూత

ఏ ఒక్కరు పేదరికం కారణంగా చదువు కోకుండా వుండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు అక్షరాలు నేర్వాలి. విద్య లేక పోతే జీవితానికి అర్థం అంటూ ఏమీ ఉండదు. తాము చదువుకుంటూ ఇతరులకు నేర్పేలా ఎదగాలి. అప్పుడే ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బులకు సార్థకత చేకూరుతుంది. ఇందు కోసం సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువ నాయకుడు జగన్మ్‌హన్ రెడ్డి. విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ..కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు అండగా పలు నిర్ణయాలు ప్రకటించారు. ఇంటర్మీడియట్ చదివే వారికి అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కాలేజీలతో పాటు ప్రైవేట్ కళాశాలలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు మరింత లబ్ధి చేకూరుతుంది. అరకులో గిరిజన పిల్లల కోసం ప్రత్యేకంగా గిరిజన విశ్వ విద్యాలయం, వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వృత్తి విద్యలకు సంబంధించి ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలల నిర్మాణంలో గత సర్కార్ తీసుక...