బంగారానికి భలే గిరాకీ ..పసిడి పైపైకి ..!

బంగారాన్ని ఇండియాలో భలే కొనుగోలు చేస్తున్నారు . దీంతో ఎక్కడలేని డిమాండ్ పసిడికి ఉంటోంది . మహిళలు లెక్కకు మించి కొనుగోలు చేస్తున్నారు . ధరలు అమాంతం పెరిగి పోయాయి . బ్యాంకు లు సైతం లాకర్లలో బంగారంతో నిండు కుంటున్నాయి . జనంతో పాటు బ్యాంకులు కూడా భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నాయి . కొనుగోలు శాతం 13 కు పైగా చేరుకోవడం మార్కెట్ వర్గాలను విస్తు పోయేలా చేసింది . పవిత్రమైన రోజులు రావడం తో పాటు ఆషాడం కారణంగా నగల దుకాణాదారులు భారీగా ఆఫర్స్ ఇవ్వడం తో కొనుగోలుదారులు , మహిళలు , వ్యాపారులు ఎక్కువగా బంగారాన్ని కొంటున్నారు. దీంతో భలే ఛాన్స్ లే అనుకుంటూ మా ఇల్లు బంగారం కావాలని తెగ కొనేస్తున్నారు . ఇంకొన్ని షాపులలో అయితే లెక్కకు మించి కొనుగోలు చేస్తుండటం కూడా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి . ఇప్పుడు పసిడి ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముకునేలా చేస్తున్నాయి . ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో గోల్డ్ 213.2 టన్నులకు చేరుకున్నట్టు డబ్ల్యూజీసీ ప్రకటించింది. 2018 రెండో క్వార్టర్‌లో ఈ డిమాండ్ కేవలం 189.2 టన్నులుగా మాత్రమే ఉండేది. వాల్యు టర్మ్స్‌లో చూస్తే గోల్డ్ డిమాండ్ 17 శాతం పెరిగి రూ.62,422...