కాంగ్రెస్ కు త్వరలో కొత్త సారధి ..?
గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకోని రీతిలో ఓటమి వెక్కిరించడంతో ఎటూ పాలు పోని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది . బీజేపీ కొట్టిన దెబ్బకు ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇక తాను కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు . దీంతో వేలాది మంది కార్యకర్తలు , అభిమానులు రాహుల్ ఉండాలని కోరారు. అయినా ఆయన ఒప్పుకోలేదు . పార్టీకి చెందిన శ్రేణులు , పెద్దలు , సీనియర్లు అంతా ఆయనే ఉండాలని పట్టుపట్టారు . రాహుల్ గాంధీ మాత్రం ఇక చాలని , ఈ భారాన్ని మోయలేనని స్పష్టం చేశారు . ఉత్తర ప్రదేశ్ లో మంచి పట్టు కలిగిన కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా రాహుల్ పోటీ చేసిన అమేథీ లో పరాజయం పాలయ్యారు . దీంతో పార్టీ పగ్గాలు తనకు వద్దని తేల్చి చెప్పారు .
సీనియర్లు మాత్రం రాహుల్ ఉండాలని పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు . అయినా రాహుల్ ససేమిరా అన్నారు . సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ లలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో కోరాయి . వేరే ఎవ్వరిని నియమించినా తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశాయి . గతం లో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది . మొత్తం మీద పార్టీ కి ఘనమైన చరిత్ర ఉన్నది . ఇంత హిస్టరీ కలిగిన పార్టీకి సారధి పూర్తి కాలం లేక పోవడం పై కార్యకర్తలు జీర్ణించు కోలేక పోతున్నారు . నాలుగైదు రోజుల్లో తాత్కాలిక చీఫ్ ను నియమించేందుకు కసరత్తు ప్రారంభిస్తోంది పార్టీ .
పార్లమెంట్ లో పార్టీకి చెందిన ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ అనధికార సమావేశాన్ని నిర్వహించారు . దేశ వ్యాప్తంగా కార్యకర్తలు , నేతలు , అభిమానులు పార్టీకి గుడ్ బై చెబుతుండడంతో పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకు కసరత్తు ప్రారంభించింది . ఏసారి ఎన్ను కోవడం ద్వారా పార్టీ చీఫ్ ను ఎన్నుకోవాలని హాయ్ కమాండ్ నిర్ణయించింది . అంతకు ముందు పార్టీని కనీసం తాత్కాలికంగా నైనా నడిపించేందుకు ..కొంత కాలం పెర్మనెంట్ గా చీఫ్ నియమించే దాకా నియామకం జరపాలని నిర్ణయం తీసుకున్నారు సోనియా గాంధీ . లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన పరాజయం సంభవించడం తో రాహుల్ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ పార్టీ చీఫ్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు . తమ కుటుంబం నుంచి ఏ ఒక్కరు పార్టీ పగ్గాలు తీసుకోమని వెల్లడించారు . పార్టీకి చెందిన సీనియర్లు , ఎమ్మెల్యేలు , ఎంపీలు పక్క చూపులు చూస్తుండడం తో పాటు కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కూలి పోవడం కూడా రాహుల్ ను తీవ్రంగా కలచి వేసింది . ఈ సందర్భం లో పార్టీ కి పూర్వ వైభవం తీసుకు రావడం పై ద్రుష్టి పెట్టారు . మొత్తం మీద సీనియర్లు తప్పుకుంటారా యువ రక్తానికి పార్టీ పగ్గాలు ఇస్తారో వేచి చూడాల్సిందే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి