టిక్ టాక్ సెన్సేషన్..ఇండియా నంబర్ వన్

సోషల్ మీడియాలో ఇప్పుడు చైనాకు చెందిన టిక్ టాక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచంలో తాజా సమాచారం మేరకు అత్యధికంగా ఈ టిక్ టాక్ వీడియో యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. నిమిషాల లోపే ఆడియో, వీడియోలను తయారు చేసుకునే వీలుండటం, క్షణాల్లోపే వరల్డ్ వైడ్ గా పాపులర్ కావడం జరుగుతోంది. చిన్నారుల దగ్గరి నుంచి వృద్ధుల దాకా అంతా టిక్ టాక్ జపం చేస్తున్నారు. నిన్నటి దాకా గేమ్స్ తో కుస్తీ పట్టిన జనం ఇప్పుడు టిక్ టాక్ లోనే జీవితం గడుపుతున్నారు. ఇక దీని ప్రభావానికి కోట్లాది మంది యూజర్స్ దీనిని వాడకుండా ఉండలేక పోతున్నారు. అంతలా టిక్ టాక్ మెస్మరైజ్ చేసేస్తోంది. ఇదిలా ఉండగా టిక్ టాక్ యాప్ సామాజిక మధ్యమ విభాగంలో ప్రపంచ చరిత్ర సృష్టించింది. దీని వీడియో యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ ప్లే సహా యాప్ స్టోర్ నుంచి 150 కోట్ల డౌన్ లోడ్లను చేరుకోగా 46.8 కోట్ల యూనిక్ ఇన్‌స్టాల్స్‌తో భారత్ నెంబర్ వన్‌గా నిలిచింది. టిక్‌టాక్ డౌన్‌లోడ్స్‌లో 31 శాతం భారత్ నుంచే కావడం గమనార్హం. 2019లో టిక్‌టాక్ గత ఏడాది కంటే ఆరు శాతం అధికంగా 61.4 కోట్ల డౌన్ లోడ్స్ సాధించిందని మొబైల్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్...