రామ్‌దాస్ సెన్సేషన్ కామెంట్స్
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రామ్‌దాస్ అంథ్‌వాలే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎం పదవిని శివసేనకు ఇచ్చేలా బీజేపీ నాయకత్వంలో ఆలోచన చేయాలని సలహా ఇచ్చారు. శివసేనకు కొన్నేళ్ల పాటు సీఎం పదవిని ఇచ్చి, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన అభిప్రాయ పడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు ఎన్డీయే పక్షాలు ఢిల్లీలో భేటీ అయ్యాయి. ఏయే అంశాలు చర్చించాలని సుదీర్ఘంగా ఈ మీటింగ్ లో చర్చించారు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, పార్లమెంట్ సభ్యులు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు ఇవ్వడంలో తప్పేమీ లేదని రాందాస్ ఈ సందర్బంగా అన్నారు. దీనిపై బీజేపీ మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా సీఎం పీఠం పంపకంపై మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన మధ్య విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కూటమిగా పోటీ చేసిన రెండు పార్టీలు అనంతరం పదవుల పంపకాలపై పట్టు బట్టాయి. సీఎం కుర్చీని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించక పోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన పావులు కదుపుతోంది. నిన్నటి దాకా మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన బీజేపీ, శివసేన పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
ఒకానొక దశలో శివసేన సీరియస్ గా రియాక్ట్ కూడా అయ్యింది. తాము ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటామని ముందు నుంచీ చెబుతూ వస్తోంది. ఆ మేరకు బద్ద శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో పొత్తుకు కూడా రెడీ అయ్యింది. ఈ మూడు పార్టీలు కలిసి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. కాగా తన కొడుకు ఆదిత్య ఠాక్రే ను మరాఠా పీఠంపై కూర్చో పెట్టాలని ఆశించిన శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే డిమాండ్ నెరవేరలేదు. ఇందుకు మిత్రపక్షాలు ఒప్పుకోలేదు. ఏది ఏమైనా కేంద్ర సర్కార్ లో కీలక మంత్రిగా ఉన్న రాందాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి